Samantha Viral Post: వంద సార్లు పడిపోయా, వద్దని వదిలేయాలనుకున్నా కానీ నిలబడ్డా

Samantha Skiing Adventure: స్విట్జర్లాండ్‌ ట్రిప్‌లో ఉన్న సామ్‌.. స్కీయింగ్ ఎలా నేర్చుకుందో చెప్పుకొచ్చింది.. చిన్నపిల్లలతో కలిసి స్కీయింగ్‌ నేర్చుకున్న సమంత.. తానుపడ్డ కష్టాలన్నింటినీ చెప్పుకుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 28, 2022, 09:37 AM IST
  • పది రోజులుగా స్కీయింగ్‌ ప్రాక్టీస్ చేసిన సమంత
  • స్విట్జర్లాండ్‌ ట్రిప్‌లో సామ్
  • స్కీయింగ్ నేర్చుకున్న విధానం గురించి చెబుతూ పోస్ట్
Samantha Viral Post: వంద సార్లు పడిపోయా, వద్దని వదిలేయాలనుకున్నా కానీ నిలబడ్డా

Samantha Skiing in Switzerland: హీరోయిన్ సమంత సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటోంది. తనకు సంబంధించి ప్రతి అప్‌డేట్‌ను సోషల్‌ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది ఈ భామ. ఇక సామ్.. (Sam) తాజాగా తాను వందసార్లు సార్లు పడిపోయాను… ప్రతిసారీ లేచాను అంటూ పోస్ట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో (Social Media) ట్రెండ్ అవుతోంది. 

సమంత గత పది రోజులుగా రోజుకు దాదాపు ఐదారు గంటలు స్కీయింగ్‌కు సంబంధించి ప్రాక్టీస్ చేసిందట. అందుకు సంబంధించిన వివరాల గురించి తెలుపుతూ ఒక స్పెషల్ పోస్ట్ చేసింది సామ్. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌ (Switzerland) ట్రిప్‌లో ఉన్న సమంత.. తాను స్కీయింగ్ నేర్చుకున్న విధానం గురించి చెబుతూ మరో పోస్ట్ చేసింది

తాను బన్నీ వాల్‌పూ స్కీయింగ్ (Skiing) ప్రయాణాన్ని ప్రారంభించానని చెప్పుకొచ్చింది సమంత. వంద సార్లు పడిపోయానని.. ప్రతిసారీ లేచానని చెప్పుకొచ్చింది సామ్. ఎన్నోసార్లు ఇక వద్దులే అనిపించింది అని అయినా కూడా వదల్లేదని పేర్కొంది. తాను ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చింది సామ్. (Sam) బన్నీ స్లోప్‌ల నుంచి రెడ్ రన్ పూర్తి చేయడానికి పట్టిన సమయం.. దానికోసం చేసిన కృషిలో చాలా విషయాలు తెలుసుకున్నానంది సమంత. ఇది ఎంతో ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఉందంటూ సమంత పోస్ట్ చేసింది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

 

Also Read: Eesha Rebba: గ్లామర్ డోస్ పెంచేసిన ఈషా రెబ్బా.. తెలుగు అందం అదిరిందబ్బా!!

స్విట్జర్లాండ్‌లోని వెర్బియర్ స్కీ రిసార్ట్‌లో తనకు స్కీయింగ్‌లో ట్రైనింగ్‌ ఇచ్చిన ట్రైనర్ కేట్ మెక్‌బ్రైడ్‌కు థ్యాంక్స్ చెప్పింది సామ్. అయితే ప్రస్తుతం సామ్ (Samantha) చేసిన ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. అలాగే సామ్ స్కీయింగ్ చేస్తూ పడిపోయిన వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: New Liquor Policy: ఇక నుంచి కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లలో ఫుల్‌గా మందు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News