Nagarjuna: అది పూర్తిగా అవాస్తవం.. దయచేసి రూమర్స్ ప్రచారం చేయొద్దు.. నాగార్జున విజ్ఞప్తి

Nagarjuna denies commenting on Samantha Naga Chaitanya:  స్టార్ కపుల్ సమంత-నాగ చైతన్య విడాకులపై నాగార్జున సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా మీడియాలో ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే అదంతా అవాస్తవమని తేల్చేశారు నాగార్జున.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 27, 2022, 08:50 PM IST
  • సమంత చైతన్యలపై నాగార్జున కామెంట్స్ చేసినట్లు ప్రచారం
  • అదంతా అవాస్తవమేనని తేల్చేసిన నాగార్జున
  • అవాస్తవాలు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి
Nagarjuna: అది పూర్తిగా అవాస్తవం.. దయచేసి రూమర్స్ ప్రచారం చేయొద్దు.. నాగార్జున విజ్ఞప్తి

Nagarjuna denies commenting on Samantha Naga Chaitanya:  స్టార్ కపుల్ సమంత-నాగ చైతన్య విడాకులపై నాగార్జున సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా మీడియాలో ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. సమంతే మొదట విడాకులు కోరిందని.. అందుకు చైతన్య అంగీకరించాడని నాగార్జున చెప్పినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు, ప్రచారాన్ని నాగార్జున ఖండించారు. అందులో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు నాగ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

'సమంత-నాగచైతన్యల గురించి నేను మాట్లాడినట్లు సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అది పూర్తిగా అవాస్తవం.. అర్థం లేనితనం.. దయచేసి మీడియా మిత్రులు ఇలాంటి రూమర్స్‌ను వార్తలుగా ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను..' అని నాగార్జున తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 'వార్తలు ఇవ్వండి.. రూమర్స్ కాదు..' అని తన పోస్ట్ చివరలో ఒక హాష్ ట్యాగ్‌ను జోడించారు.

కాగా, సమంత-నాగచైతన్య విడాకులపై (Samantha Naga Chaitanya Divorce) నాగార్జున తొలిసారిగా స్పందించినట్లు ఇవాళ (జనవరి 27) ఉదయం నుంచి మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎంతో ప్రేమగా ఉండే ఆ ఇద్దరి మధ్య విడిపోయేంత సమస్య లేదని నాగ్ పేర్కొన్నట్లు అందులో పేర్కొన్నారు. న్యూ ఇయర్ తర్వాతే ఇద్దరి మధ్య ఏదో సమస్య వచ్చిందని.. అయితే అది కచ్చితంగా ఏంటనేది తనకూ తెలియదని నాగ్ చెప్పినట్లుగా ప్రస్తావించారు. అంతేకాదు, మొదట సమంతే విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుందని... అందుకు ఆమె అప్లై కూడా చేసిందని... నాగచైతన్య ఆమె నిర్ణయాన్ని అంగీకరించాడని చెప్పినట్లుగా పేర్కొన్నారు. తాజాగా నాగ్ ఆ వార్తలను ఖండించడంతో అందులో ఏమాత్రం నిజం లేదని తేలిపోయింది. 

Also Read: Covid Guidelines: కోవిడ్ మార్గదర్శకాలు ఫిబ్రవరి 28 వరకు పొడగింపు.. కేంద్రం ఉత్తర్వులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News