/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Republic Day 2023: గణతంత్ర దినోత్సవం 2023 సందర్భంగా.. భారత రాజ్యాంగానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ఒకసారి చూద్దాం. రాజ్యాంగానికి సంబంధించిన రెండు ఒరిజినల్ చేతిరాత కాపీలు హిందీ, ఇంగ్లిష్‌లో మాత్రమే ఉన్నాయి. ఈ కాపీలను పార్లమెంటులో హీలియంతో నింపిన బాక్స్‌లలో భద్రంగా ఉంచారు.

ఇక రాజ్యాంగాన్ని రాయడానికి చాలా సమయం పట్టింది. ఆ పనిని పూర్తి చేయడానికి 2 సంవత్సరాలు, 11 నెలల 18 రోజులు పట్టింది.భారత రాజ్యాంగం 22 భాగాలు, 12 షెడ్యూల్‌లుగా వర్గీకరించబడిన 444 ఆర్టికల్‌లను కలిగి ఉంది. ఇక ఇంతకుముందు కింగ్స్‌వేగా ప్రసిద్ధి చెందిన రాజ్‌పథ్, జనవరి 26, 1955న రిపబ్లిక్ డే పరేడ్‌కు శాశ్వత వేదికగా మారింది.

మొదటి గణతంత్ర దినోత్సవ పరేడ్ జనవరి 26, 1950న జరిగింది. ఈ కార్యక్రమానికి ఇండోనేషియా అధ్యక్షుడు డాక్టర్ సుకర్ణో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గణతంత్ర దినోత్సవ పరేడ్ (Republic Day Parade) రాష్ట్రపతి రాకతో ప్రారంభమవుతుంది. ఆయన సెక్యూరిటీ ముందుగా జాతీయ జెండాకు వందనం చేస్తుంది.

ఇక గణతంత్ర దినోత్సవం (Republic Day 2023) రోజున గన్ సెల్యూట్ ఫైరింగ్ కూడా ఉంటుంది. జాతీయ గీతం ఆలపన సమయం ప్రారంభానికి ముందు.. మొదటిసారి ఫైరింగ్ ఉంటుంది. 52వ సెకన్లప్పుడు చివరిగా ఫైరింగ్‌ చేస్తారు.

అలాగే ఫ్లైపాస్ట్‌లో పాల్గొనాల్సిన ఎయిర్‌క్రాఫ్ట్‌లు వేర్వేరు బేస్ పాయింట్ల నుంచి బయలుదేరి.. నిర్ణీత సమయానికి వేదిక వద్దకు చేరుకుంటాయి. అయితే ఇది చాలా సమన్వయంతో కూడిన పని. ఇక 1950లో ఆమోదం పొందిన మన రాజ్యాంగం.. బ్రిటీష్ కలోనియల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ (1935) స్థానంలో వచ్చింది.

Also Read : Lucknow IPL Team Name: లక్నో సూపర్ జెయింట్స్.. టీమ్ పేరు ప్రకటించిన లక్నో ఫ్రాంచైజీ

రిపబ్లిక్ డే ఈవెంట్లలో పాల్గొనే ప్రతి ఆర్మీ సిబ్బంది.. ఫోర్ లేయర్ ఇన్వెస్టిగేషన్‌ ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది.రిపబ్లిక్ డే (Republic Day) పరేడ్ సమయంలో ప్రదర్శించిన టేబుల్‌యాక్స్ నిర్ణీత వేగం గంటకు సుమారు 5 కి.మీ ఉంటుంది. భారత రాజ్యాంగం అసలైన చేతిరాత కాపీలపై జనవరి 24, 1950న అసెంబ్లీలోని 308 మంది సభ్యులు సంతకాలు చేశారు.

Also Read : Republic Day Significance: జనవరి 26న రిపబ్లిక్ డేను ఎందుకు జరుపుకొంటారో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Section: 
English Title: 
Republic Day 2022: Know The Amazing facts
News Source: 
Home Title: 

Republic Day 2023 : రిపబ్లిక్‌ డేకు సంబంధించిన ఇంట్రెస్టింగ్‌ ఫ్యాక్ట్స్‌ ఇదిగో

Republic Day 2023 : రిపబ్లిక్‌ డేకు సంబంధించిన ఇంట్రెస్టింగ్‌ ఫ్యాక్ట్స్‌ ఇదిగో
Caption: 
Republic Day 2023 (Zee News)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

గణతంత్ర దినోత్సవం 2023 సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు

రిపబ్లిక్ డే పరేడ్‌కు శాశ్వత వేదికగా మారిన కింగ్స్‌వేగా ప్రసిద్ధి చెందిన రాజ్‌పథ్ 

Mobile Title: 
Republic Day 2023: రిపబ్లిక్‌ డేకు సంబంధించిన ఇంట్రెస్టింగ్‌ ఫ్యాక్ట్స్‌ ఇదిగో
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Tuesday, January 25, 2022 - 18:47
Request Count: 
161
Is Breaking News: 
No