Pushpa Dialogue video: అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప' మూవీ గత ఏడాది డిసెంబర్ 17న విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. పాన్ ఇండియా లెవెల్లే విడుదలైన ఈ సినిమా పాటలు, డైలాగ్స్, సీన్స్ వైరల్ (Pushpa Movie dialogues viral) అవుతూ.. నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.
అయితే ఇండియాలోనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలోనూ ఈ సినిమా డైలాగ్స్ ట్రెండవుతుండటం (Pushpa dialogues trending) విశేషం.
టాంజానియా టిక్‌టాకర్ నోట తగ్గేదే లే డైలాగ్..
టాంజానియాకు చెందిన డ్యాన్సర్, టిక్‌టాకర్, ఇన్స్టాగ్రామ్ స్టార్ కిలి పాల్ తాజాగా పుష్పా సినిమా డైలాగ్‌కు లిప్ సింక్ (Kili paul lip syncs for pushpa dialogue) చేశాడు. ఇన్‌స్టా గ్రామ్‌లో ఇందుకు సంబంధించిన వీడియోన్ పోస్ట్ చేయగా ఇప్పుడది వైరల్‌గా మారింది.
'పుష్పా అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్.. నీయవ్వ తగ్గేదేలే' అనే మాస్ డైలాగ్ సినిమాలో ఎంత పవర్ ఫుల్‌గా ఉంటుందో సినిమా చూసిన వాళ్లందరికి తెలిసే (Pushpa thaggedele dialogue) ఉంటుంది. అయితే డైలాగ్ హిందీ వెర్షన్‌కు కిలి పాండే లింప్ సింక్ చేశాడు. డైలాగ్ మాత్రమే కాదండోయ్.. అచ్చం అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్‌నూ ట్రై చేశాడు (Kili paul thaggedele dialogue) కిలి పాల్.
ఈ వీడియో చూసిన చాలా మంది.. ఇండియన్ సినిమా పవర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కిలి పాల్ లిప్ సింక్, బాడీ లాంగ్వేజ్‌ను కూడా తెగ పొగిడేస్తున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో సెలెబ్రెటీలు పుష్ప డైలాగ్‌ను పేల్చడం ఇది మొదటి సారి కాదు. ఇప్పటికే ప్రముఖ క్రికెటర్లు డేవిడ్ వార్నర్, రవీంద్ర జడేజా, శిఖర్ ధావన్ కూడా.. తగ్గేదే లే డైలాగ్‌లకు లిప్ సింక్ చేసిన (Pushpa thaggedele dialogue viral) విషయం తెలిసిందే.
Also read: Shocking Video: మొసలి నోట్లో తల పెట్టిన యువకుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Also read: Woman on Burj Khalifa: వామ్మో!! బుర్జ్ ఖలీఫాపై నిలబడి.. అడ్వర్టైజ్మెంట్ వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook