Bihar Katihar Newborn: బీహార్‌లో వింత శిశువు జననం... నాలుగు కాళ్లు, నాలుగు చేతులు...

Baby with four hands and legs : శిశువు జననంపై కుటుంబ సభ్యులు, బంధువులు మాట్లాడుతూ.. ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడి నిర్వాకం వల్లే ఇలా జరిగిందన్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీయించినప్పటికీ.. గర్భస్త శిశువులో లోపాలు ఉన్న సంగతి తమకు చెప్పలేదన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 19, 2022, 07:51 AM IST
  • బీహార్‌లో వింత శిశువు జననం
  • శిశువుకు నాలుగు కాళ్లు, నాలుగు చేతులు
  • ఆందోళన చెందుతున్న శిశువు తల్లిదండ్రులు
Bihar Katihar Newborn: బీహార్‌లో వింత శిశువు జననం... నాలుగు కాళ్లు, నాలుగు చేతులు...

Baby with four hands and legs : బీహార్‌కి చెందిన ఓ మహిళ నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉన్న శిశువుకు (Bihar Katihar Newborn) జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. ఆ శిశువును చూసేందుకు ఆసుపత్రికి వద్దకు జనం క్యూ కడుతున్నారు. బీహార్‌లోని కతిహార్ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

కతిహార్‌లోని ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఆ మహిళ ఇటీవల నొప్పులు రావడంతో  సదర్ ఆసుపత్రికి వెళ్లింది. అక్కడి వైద్యులు సర్జరీ ద్వారా ఆమెకు డెలివరీ చేశారు. నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో కూడిన శిశువు జన్మించడంతో మహిళ భర్త షాక్ తిన్నాడు. జన్యు లోపం వల్లే శిశువు ఇలా జన్మించిందని వైద్యులు వెల్లడించారు. నిజానికి ఆమె గర్భంలో కవలలు ఉన్నారని... అయితే సరైన ఎదుగుదల లేకపోవడం వల్ల ఈ లోపం తలెత్తిందని తెలిపారు.

శిశువు జననంపై కుటుంబ సభ్యులు, బంధువులు మాట్లాడుతూ.. ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడి నిర్వాకం వల్లే ఇలా జరిగిందన్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీయించినప్పటికీ.. గర్భస్త శిశువులో లోపాలు ఉన్న సంగతి తమకు చెప్పలేదన్నారు. శిశువు నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో పుట్టడంతో వారు ఆందోళన చెందుతున్నారు.

సాధారణంగా గర్భిణిలకు (Pregnancy Tips) మూడో నెల చివరి వారంలో ఎన్‌టీ స్కాన్ (Nuchal Translucency Scan), ఐదో నెలలో టిఫా (Tiffa-Targeted Imaging For Fetal Anomalies) స్కాన్ నిర్వహిస్తారు. తద్వారా గర్భస్త శిశువులో ఏవైనా లోపాలు ఉంటే.. ఆ రిపోర్ట్స్‌లో వెల్లడయ్యే అవకాశం ఉంటుంది. శిశువు ఆరోగ్యంగా లేకపోతే గర్భాన్ని తొలగించుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఆ సమయంలో స్కానింగ్ తీయించుకోకపోయినా... స్కానింగ్ సరిగా తీయకపోయినా శిశువులో లోపాలను గుర్తించేందుకు ఆస్కారం ఉండదు. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. 

Also Read: Explosion in INS Ranvir: ఐఎన్ఎస్ రణవీర్‌లో పేలుడు.. ముగ్గురు నేవీ సిబ్బంది మృతి

Also Read: Horoscope Today January 19 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి మొండితనం పనికి రాదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News