Allu Arjun replay to Dairy brand Amul over Pushpa cartoon: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కాంబినేషనల్‌లో వచ్చిన పాన్ ఇండియా సినిమా 'పుష్ప: ది రైజ్' (Pushpa). గతేడాది డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పుష్ప రిలీజై ఇప్పటికి నెల గడుస్తున్నా.. కలెక్షన్ల సునామి మాత్రం తగ్గేదేలే అంటోంది. సంక్రాంతి కానుకగా ఓటీటీలో విడుదలైనా.. పుష్ప కోసం ఫాన్స్ థియేటర్స్‌కే వెళుతున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
పాన్ ఇండియా లెవల్లో బంపర్ హిట్ కొట్టిన 'పుష్ప' సినిమాపై ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. స్టార్ హీరో, హీరోయిన్‌లు చిత్ర బృందంకు అభినందనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో పుష్ప సినిమాకు ప్రముఖ డైరీ బ్రాండ్ 'అమూల్' (Amul) సరికొత్తగా అభినందనలు తెలిపింది. ఆర్ట్ వర్క్‌లో అల్లు అర్జున్, రష్మిక మందన్న పాత్రలను పోలి ఉండే కార్టూన్‌లను క్రియేట్ చేసింది. ఈ కార్టూన్ (Pushpa Cartoon)ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. 'అమూల్ టాపికల్ కొత్త యాక్షన్ డ్రామా సినిమా భారీ హిట్. అముల్లు.. అర్జున్' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read: India New Test Captain: భారత టెస్టు కెప్టెన్‌ను ఎంపిక చేసిన బీసీసీఐ.. త్వరలోనే అధికారిక ప్రకటన!!
అమూల్ కార్టూన్ పోస్ట్ చూసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనదైన శైలిలో స్పందించారు. అమూల్ పోస్టర్‌ను తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ 'అల్లు టు మల్లు టు అముల్లు అర్జున్' అని అల్లు అర్జున్ సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ పోస్టర్‌ను షేర్ చేస్తూ రష్మిక కూడా ఆనందంలో మునిగిపోయారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ కూడా అమూల్ కార్టూన్ పోస్టుపై స్పందించింది. 'ఇది వెన్న కాదు పువ్వు కాదు.. నిప్పు' అని పేర్కొంది. అమెజాన్ ప్రైమ్‌లోనే పుష్ప సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన 'పుష్ప'లో అల్లు అర్జున్ 'పుష్ప రాజ్'గా నటించారు. ఇప్పటివరకూ ఎన్నడూ చూడని విధంగా బన్నీని ఊరమాస్ యాంగిల్‌లో సుక్కు చూపించారు. చిత్తూరు యాసలో 'తగ్గేదే లే' అంటూ బన్నీ చెప్పిన డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. నిజం చెప్పాలంటే అల్లు అర్జున్ తన నటనతో వన్ మ్యాన్ షో చేశాడనే చెప్పాలి. ఇక శ్రీవల్లి పాత్రలో స్టార్ హీరోయిన్ రష్మిక (Rashmika) తనదైన శైలిలో నటించారు. సునీల్ (Sunil), అనసూయ (Anasuya) కూడా ఆకట్టుకున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ (DSP) సంగీతం సినిమాకు ప్లస్ అయింది. 'ఊ అంటావా మావ' అనే పాట ఎంత ఫేమస్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook