Ashes 2021-22: యాషెస్ సిరీస్‌ను 4-0 ఆధిక్యంతో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. చివరిదైన ఐదో టెస్టులో ఇంగ్లాండ్ పై ఆసీస్ 146 పరుగుల తేడాతో ఘన విజయం (Australia win fifth Test) సాధించింది. చివరి మ్యాచ్ లో నైనా గెలిచి పరువు దక్కించుకోవాలనుకున్న ఇంగ్లాండ్ (England)..బ్యాటర్ల వైఫల్యంతో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. కంగూరు జట్టు నిర్దేశించిన 271 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక.. 124 రన్స్ కే కుప్పకూలింది.
56 పరుగులకే 9 వికెట్లు
271 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ (England) ఓపెనర్లు శుభారంభం అందించారు. క్రాలే (36), రోరీ బర్న్స్ (26) తొలి వికెట్‌కు అర్ధశతక (68) భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే బర్న్స్ ఔటైన తర్వాత ఒక్కరు కూడా ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేయలేదు. వచ్చిన వారు వచ్చినట్టే వెనుదిరిగారు. ఆసీస్ బౌలర్లు ధాటికి...కేవలం 56 పరుగులకే మిగతా తొమ్మిది వికెట్లను కోల్పోయింది ఇంగ్లాండ్. మలన్ 10, రూట్ 11, స్టోక్స్ 5, పోప్ 5, బిల్లింగ్స్ 1, వోక్స్ 5, మార్క్‌వుడ్ 11 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్ (Pat Cummins) 3, బొలాండ్ 3, గ్రీన్ 3.. స్టార్క్ ఒక వికెట్ పడగొట్టాడు.
Also Read: Anushka Sharma Emotional Note: టెస్ట్ కెప్టెన్సీకి కోహ్లీ గుడ్‌బై.. అనుష్క శర్మ ఎమోషనల్ పోస్ట్!!
చెలరేగిన మార్క్‌వుడ్
అంతకముందు తొలి ఇన్నింగ్స్‌లో 115 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్‌ను ఇంగ్లాండ్ బౌలర్లు దెబ్బతీశారు. మార్క్‌వుడ్ (6/37) (Mark Wood), బ్రాడ్ (3/51), వోక్స్ (1/40) చెలరేగడంతో 155 పరుగులకే అతిథ్య జట్టు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లు అలెక్స్ క్యారీ (49), స్మిత్ (27), గ్రీన్ (23) రాణించడంతో ఈ మాత్రం స్కోరునైనా సాధించగలిగింది. దీంతో మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని 270 పరుగుల ఆధిక్యం సంపాదించింది ఆస్ట్రేలియా.
ఐదో టెస్టు స్కోరు వివరాలు:
ఆస్ట్రేలియా: 303 & 155 ఆలౌట్ (56.3 ఓవర్లు)
ఇంగ్లాండ్: 188 & 124 ఆలౌట్ (38.5 ఓవర్లు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Ashes 2021-22: ఇంగ్లాండ్ చిత్తు...యాషెస్ సిరీస్ ఆస్ట్రేలియాదే..
ఆఖరి టెస్టులోనూ ఇంగ్లాండ్ ఘోర పరాజయం
4-0 తేడాతో సిరీస్ ఆసీస్ కైవసం