CM Jagan on PRC: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో పీఆర్సీపై రాష్ట్ర ఉద్యోగ సంఘాలు సమావేశం ముగిసింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని 13 ఉద్యోగ సంఘాల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఉద్యోగ సంఘాలు చెప్పిన అన్ని అంశాలను నోట్ చేసుకున్నట్లు సీఎం చెప్పారు. అన్ని సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం మోయలేని విధంగా భారం ఉండకూడదని.. ఉద్యోగ సంఘాలు సానుకూల దృక్పథంతో ఉండాలని కోరుతున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఎంత మంచి చేయగలిగితే అంత చేస్తానని.. మంచి చేయాలనే తపనతోనే ఉన్నట్లు సీఎం వివరించారు. రెండు మూడు రోజుల్లో పీఆర్సీపై ప్రకటన చేస్తామని సీఎం జగన్ వెల్లడించారు.
71 డిమాండ్లతో ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసు ఇచ్చాయి. దీనిపై సీఎస్, ఇతర అధికారులు చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి పరిష్కారం లభించలేదు. వీటిలో ప్రధానంగా పీఆర్సీ, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసులు పర్మినెంట్ చేయడం తదితర డిమాండ్లు ఉన్నాయి.
వీటిని సత్వరమే పరిష్కరించాలని ఆయా సంఘాల నేతలు సీఎంను కోరుతున్నారు. ఉద్యోగులు 55 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇటీవల సీఎస్ కమిటీ 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీన్ని ఉద్యోగ సంఘాలు తిరస్కరించాయి.
తమకు 55 శాతం ఫిట్మెంట్ ఇస్తేనే ఆమోదయోగ్యంగా ఉంటుందని పునరుద్ఘాటించాయి. కరోనా పరిస్థితులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 14.29 శాతానికి అంగీకరించాలని ప్రభుత్వ వర్గాలు చెప్పినప్పటికీ ఉద్యోగులు వెనక్కితగ్గలేదు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌తో ఉద్యోగ సంఘాలు సీఎం జగన్‌తో చర్చలు జరిపాయి.
Also Read: AP Corona Update: ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. 547 మందికి పాజిటివ్!
Also Read: GO No.2 Withdraw: సర్పంచులకు గుడ్ న్యూస్.. జీవో నం.2ను వెనక్కి తీసుకున్న ఏపీ సర్కారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.