CDS Bipin Rawat: హెలికాప్టర్​ ప్రమాదంపై విచారణ పూర్తి- వచ్చే వారమే తుది నివేదిక!

CDS Bipin Rawat: గత ఏడాది డిసెంబర్​లో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై విచారణ ముగిసినట్లు తెలుస్తోంది. ఈ ప్రమదాంలో భారత తొలి సీడీఎస్​ జనరల్ బిపిన్ రావత్ సహా 13 మంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 2, 2022, 09:16 AM IST
  • సీడీఎస్ హెలికాప్టర్ ప్రమాద ఘటనపై ముగిసిన విచారణ
  • త్వరలోనే సమగ్ర నివేదిక సమర్పించనున్న దర్యాప్తు బృందం
  • అన్ని కోణాల్లో ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు
CDS Bipin Rawat: హెలికాప్టర్​ ప్రమాదంపై విచారణ పూర్తి- వచ్చే వారమే తుది నివేదిక!

CDS Bipin Rawat: తమిళనాడులోని నిలగిరి జిల్లా కూనూర్​ సమీపంలో సీడీఎస్​ జనరల్ బిపిన్​ రావత్ సహా​ మరో 13 మంది దుర్మరణానికి కారణమైన ఆర్మీ హెలికాప్టర్​ ప్రమాద ఘటనపై (CSD Bipin Rawat Helicopter Crash) విచారణ పూర్తయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఐఏఎఫ్​, ఆర్మీ, నేవీకి చెందిన అధికారులు ఈ దర్యాప్తులో పాల్గొన్నారు.

వచ్చే వారమే ఘటనకు సంబంధించిన నివేదికను వైమానిక దళానికి (ఐఏఎఫ్) సమర్పించనున్నట్లు (IAF report on Helicopter Crash) సమాచారం.

అన్ని కోణాల్లో దర్యాప్తు..

ఎయిర్ మార్షల్​ మానవేంద్ర సింగ్ నేతృత్వంలోని దర్యాప్తు బృందం.. మానవ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందా? వాతావరణం అనుకూలించలేదా? అనే విషయాలతోపాటు అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపినట్లు తెలిసింది. ల్యాండింగ్ సమయంలో సిబ్బంది అయోమయ స్థితిలో ఉన్నారా అనే అంశం కూడా పరిశీలించినట్లు (Army Helicopter Crash News) తెలుస్తోంది.

ఈ దర్యాప్తు బృందంలో ఎయిర్​ మార్షల్ మానవేంద్ర సింగ్​తో పాటు ఆర్మీ, నేవీలకు చెందిన బ్రిగేడియర్ ర్యాంక్ అధికారులు దర్యాప్తులు పాల్గొని నివేదికను రూపొందించారు. ఈ విచారణకు సంబంధించి ఓ అధికారి కీలక ప్రకటన కూడా చేశారు. అన్ని నిబంధనలకు లోబడే ఈ విచారణ జరిగిందనే విషయాన్ని నిర్ధారించుకునేందుకు చట్టపరమైన పరిశీలన జరగుతున్నట్లు వివరించారు. అయితే విచారణకు సంబంధించి ఇప్పటి వరకు త్రివిద దళాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

ఘటన ఇలా..

గత నెల ఆరంభంలో కూనూర్ అటవీ ప్రాంతంలో ప్రయాణిస్తుండగా ఆర్మీ హెలికాప్టర్​ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్​, ఆయన సతీమణితో సహా హెలికాప్టర్​ సిబ్బంది, ఇతర అధికారులు కలిపి మొత్తం 14 మంది దుర్మరణం పాలయ్యారు. ఓ అధికారి మాత్రం తీవ్ర గాయాలతో బయటపడినప్పటికీ.. ఆ తర్వాత ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. గత నెల 8న జరిగిన ఈ ఘటన యావత్​ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.

Also read: FCRA Act: ఢిల్లీ ఐఐటీ సహా ఆ సంస్థలకు ఇక విదేశీ విరాళాలు లేవు

Also read: Emerald Shivling: రూ.500 కోట్ల విలువైన శివలింగం స్మగ్లింగ్.. తమిళనాడులో అధికారుల స్వాధీన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News