ATM Charges : ఏటీఎం విత్ డ్రా కొత్త ఛార్జీలు.. నేటి నుంచి పెరగనున్న ఛార్జీలు

ATM Cash Withdrawal Charges Increase:  : ఏటీఎం కార్డ్ వాడుతూ డబ్బులు విత్ డ్రా చేసే వారందరికీ ఒక అలర్ట్. 2022 జనవరి 1 నుంచి అంటే ఈ రోజు నుంచి ఏటీఎంలలో డబ్బు విత్ డ్రా చేసే విషయంలో కొన్ని కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 1, 2022, 10:31 AM IST
  • ఉచిత లావాదేవీల తర్వాత చేపట్టే ఏటీఎం ట్రాన్సక్షన్స్ పై ఛార్జీల పెంపు
  • ఇవాల్టి నుంచి ఏటీఎం అదనపు ట్రాన్సాక్షన్లకు రూ. 21 చొప్పున చెల్లించాలి..
ATM Charges : ఏటీఎం విత్ డ్రా కొత్త ఛార్జీలు.. నేటి నుంచి పెరగనున్న ఛార్జీలు

ATM Cash Withdrawal Charges to Increase from today: Know Charges : ఏటీఎం కార్డ్ వాడుతూ డబ్బులు విత్ డ్రా చేసే వారందరికీ ఒక అలర్ట్. 2022 జనవరి 1 నుంచి అంటే ఈ రోజు నుంచి ఏటీఎంలలో డబ్బు విత్ డ్రా చేసే విషయంలో కొన్ని కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తున్నాయి. మరి ఆ ఛార్జీలు ఏమిటి.. ఎందుకు పడతాయి.. ఫ్రీ ట్రాన్సక్షన్స్ ఎన్ని ఉంటాయనే వివరాలు తెలుసుకుందాం. అన్ని బ్యాంక్‌లు ఏటీఎంలో ఫ్రీ ట్రాన్సాక్షన్ చేసుకునేందుకు పరిమిత లిమిట్ ఇస్తాయి. ఆ లిమిట్ దాటితే ఛార్జీలు వేస్తాయి. ప్రతి ట్రాన్సాక్షన్‌పై ఛార్జీలు వసూలు చేస్తాయి. 

ఉచిత లావాదేవీల తర్వాత చేపట్టే ఏటీఎం ట్రాన్సక్షన్స్ పై ఛార్జీలు (ATM Cash Withdrawal Charges) నేటి నుంచి పెరగనున్నాయి. ఇవాల్టి నుండచి ఏటీఎం అదనపు ట్రాన్సాక్షన్లకు రూ. 21 చొప్పున చెల్లించాలంటూ గతంలోనే ఆర్​బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి.

నిన్నటి వరకు ఏటీఎం అదనపు ట్రాన్సక్షన్స్ పై (Additional Transactions) ఛార్జీలు ఇలా ఉన్నాయి... ఒక్కో అదనపు ట్రాన్సక్షన్‌కు (Transaction) రూ. 20 అలాగే జీఎస్‌టీ ఉండేది. ఇప్పుడు  రూ. 21 అలాగే జీఎస్‌టీ ఉంటుంది. ఇక సొంత బ్యాంక్​ ఏటీఎంలలో ఒక నెలకు ఐదు ఫ్రీ  ట్రాన్సక్షన్స్ చేసుకోవొచ్చు. ఇంటర్​ ఛేంజ్​ ఫీజును (Interchange fee) 15 రూపాయల నుంచి 17 రూపాయలకు పెంచుకునేందుకు కూడా బ్యాంకులకు రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (Reserve Bank of India) గతంలోనే అనుమతి ఇచ్చింది. ఒక బ్యాంక్ కస్టమర్ మరో బ్యాంక్ ఏటీఎంలో (ATM) డబ్బులు విత్ డ్రా చేస్తే ఈ ఇంటర్‌ ఛేంజ్ ఫీజు వర్తిస్తుంది.ఇక నాన్ ఫైనాన్షియల్​ ఏటీఎం లావాదేవీలపై ఇంటర్‌‌ఛేంజ్​ ఫీజును ఆరు రూపాయలకు పెంచింది. ఇది గతేడాది ఆగస్టు 1 నుంచే అమల్లోకి వచ్చింది. ఏటీఎంల నిర్వహణ ఖర్చులు పెరగడంతోనే ఛార్జీలను పెంచినట్లు ఆర్​బీఐ పేర్కొంది. 

Also Read : Corona cases in India: ఒక్క రోజులో 22,700 కరోనా కేసులు, 406 మరణాలు

ఇక ఏటీఎం ఛార్జీల రివ్యూ కోసం 2019, జూన్‌లో రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా ఒక కమిటీని నియమించింది. దానికి ఐబీఏ సీఈఓ చైర్మన్​గా వ్యవహరించారు. వివిధ అంశాలపై రివ్యూ పూర్తయ్యాక  ఏటీఎం ట్రాన్సక్షన్స్ పై ఆర్బీఐ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి కొత్త ఛార్జీలు వసూలు చేసేందుకుగానూ బ్యాంకులు రెడీ అయ్యాయి. ఇప్పటికే కొన్ని బ్యాంక్స్ (Banks) అదనపు ట్రాన్సక్షన్స్ పై విధించే ఛార్జీల (Charges) గురించి వినియోగదారులకు సమాచారం ఇస్తున్నాయి.

Also Read : Deepthi Breakup with Shanmukh: షణ్ముఖ్‌కు బ్రేకప్ చెప్పేసిన దీప్తి సునైనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News