Ross Taylor: అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన న్యూజిలాండ్ స్టార్ క్రికెట‌ర్‌

Ross Taylor: న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు రాస్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా టేలర్ ప్రకటించాడు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 30, 2021, 08:41 AM IST
Ross Taylor: అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన న్యూజిలాండ్ స్టార్ క్రికెట‌ర్‌

Ross Taylor announces retirement: న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ రాస్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్ (Ross Taylor announces retirement) కు గుడ్ బై చెప్పాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా టేలర్ (Ross Taylor) ప్రకటించాడు. 39 ఏళ్ల టేలర్‌.. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌తో ఆరు వన్డేలు అనంతరం తప్పుకోనున్నట్లు తెలిపాడు.

"ఈ రోజు నేను ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నాను. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌తో ఆరు వన్డేలు ఆడిన తర్వాత తప్పుకుంటాను. 17 సంవత్సరాలపాటు నాకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు. నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా భావిస్తున్నాను" అని టేలర్‌ ట్విట్టర్ లో రాసుకొచ్చాడు. 

Also Read: Jasprit Bumra - Sanjana Ganeshan: జస్ప్రీత్ బుమ్రాతో వెకేషన్.. సంజన గణేశన్‌ హాట్‌నెస్‌కు ఫాన్స్ ఫిదా!!

2006లో వెస్టిండీస్‌పై (Westindies)  అంతర్జాతీయ క్రికెట్‌లో టేలర్‌ అరంగటేట్రం చేశాడు. నవంబర్ 2007లో దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు ఆడాడు. ఇప్పటి వరకు 233 వన్డేల్లో 8576 పరుగులు చేశాడు. అతడి వన్డే కేరిర్‌లో 21 సెంచరీలు ఉన్నాయి. అతడు 102 టీ20ల్లో 1909 పరుగులు చేశాడు. ఇక ఇప్పటివరకు 110 టెస్టుల్లో 7585 పరుగులు సాధించాడు. కివీస్ తరుపున టెస్ట్, వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా టేలర్ కు రికార్డు ఉంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

 మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News