RRR Movie Effect: RRR సినిమా ప్రభావం బాలీవుడ్‌పై తీవ్రంగా ఉండనుందా..ఎందుకు

RRR Movie Effect: ఒక సినిమా వెయిటింగ్ ముగిసింది. అంచనాలు నిజమయ్యాయి. మరో సినిమా కోసం సినీ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఆ సినిమాపై ప్రముఖ సినీ విశ్లేషకులు ఎందుకు అలా అంటున్నారు. ఏం జరగనుంది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 27, 2021, 11:41 AM IST
RRR Movie Effect: RRR సినిమా ప్రభావం బాలీవుడ్‌పై తీవ్రంగా ఉండనుందా..ఎందుకు

RRR Movie Effect: ఒక సినిమా వెయిటింగ్ ముగిసింది. అంచనాలు నిజమయ్యాయి. మరో సినిమా కోసం సినీ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఆ సినిమాపై ప్రముఖ సినీ విశ్లేషకులు ఎందుకు అలా అంటున్నారు. ఏం జరగనుంది. 

బాలీవుడ్, టాలీవుడ్‌లో ఇప్పుడు పాన్ ఇండియా మూవీల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే బాహుబలి, కేజీఎఫ్, పుష్ప వంటి భారీ పాన్ ఇండియా మూవీలు విడుదలై అంచనాల్ని అందుకున్నాయి. కొన్ని అంచనాల్ని దాటేశాయి. బాహుబలి, కేజీఎఫ్, పుష్ప హిందీ వెర్షన్స్ విజయవంతమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలైన పుష్ప సినిమా బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. ప్రపంచ సినీ లోకం ఈ సినిమా కోసం ఎదురుచూస్తోంది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) తెరెకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 7, 2022 న  విడుదలకు సిద్ఘంగా ఉంది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమరం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తుండగా, అలియా భట్ ఒలీవియో మోరిస్‌లు హీరోయిన్స్‌గా కన్పించనున్నారు. మరోవైపు అజయ్ దేవగణ్, సముద్రఖని, శ్రియ కీలకపాత్రలు పోషించారు. 450 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. బాహుబలి సినిమా సృష్టించిన క్రేజ్‌తో..సహజంగానే రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీపై (RRR Movie) అంచనాలు ఎక్కువయ్యాయి.

ఈ నేపధ్యంలో ప్రముఖ సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ (Taran Adarsh)..ఆర్ఆర్ఆర్ సినిమాపై చేసిన ట్వీట్ బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. బాలీవుడ్‌పై ఆర్ఆర్ఆర్ సినిమా (RRR Movie Effect) ప్రభావం భారీగా ఉంటుందని తరణ్ ఆదర్శ్ పేర్కొన్నాడు బాలీవుడ్ పరిశ్రమ పూర్తిగా మెట్రో సెంట్రిక్ సినిమాలు చేయడంలో బిజీగా ఉందని..చాలాకాలం క్రితమే గ్రామీణ ప్రాంతాల్ని వదిలేశామని తరణ్ ఆదర్శ్ చెప్పారు. ఇప్పుడు మనమంతా క్రమంగా టైర్ 2, టైర్ 3 నగరాల్ని కూడా కోల్పోతున్నామన్నారు. అటు హిందీలో డబ్ అవుతున్న దక్షిణాది చిత్రాలు మెట్రో, నాన్ మెట్రో నగరాల్ని లక్ష్యంగా చేసుకున్నాయన్నారు. ఇప్పటికే బాహుబలి, కేజీఎఫ్, పుష్ప సినిమాలు విజయవంతమయ్యాయి. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా వస్తోంది. ఈ సినిమా ప్రభావం బాలీవుడ్‌పై (Bollywood) భారీగా ఉంటుందని..వెయిట్ చేయండంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ వెనుక అర్ధమేంటనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. బాలీవుడ్‌పై ప్రభావం భారీగా అంటే..పాజిటివ్‌గా తీసుకోవాలా లేదా నెగెటివ్‌గానా అనే ప్రశ్నలు వస్తున్నాయి. లేదా బాలీవుడ్ ఇతర సినిమాలపై తీవ్ర ప్రభావం ఉంటుందా అనే అనుమానాలు వస్తున్నాయి.

Also read: Open Letter to CJI: తెలుగు సినిమాను దుష్ట శక్తి పీడిస్తోందా..సీజేఐకు ఆ లేఖ రాసిందెవరు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News