Omicron in Bangladesh: బంగ్లాదేశ్ క్రికెట్ జట్టులోని ఇద్దరు మహిళా క్రికెటర్లు కరోనా బారిన పడ్డారు. అయితే కొవిడ్ లక్షణాలతో బాధ పడుతున్నా వారి శాంపిల్స్ ను ఒమిక్రాన్ టెస్ట్ కు పంపగా.. అందులోనూ వారికి పాజిటివ్ గా తేలింది. దీంతో వారిద్దరిని క్వారంటైన్ కు తరలించినట్లు బోర్డు అధికారులు తెలిపారు. అయితే ఇటీవలే బంగ్లాదేశ మహిళల క్రికెట్ జట్టు జింబాబ్వేతో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడి వచ్చింది.
"ఒమిక్రాన్ బారిన పడిన ఆ ఇద్దరు మహిళా క్రికెటర్లు ఓ హోటల్లో క్వారంటైన్లో ఉన్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉంది." అని బంగ్లాదేశ్ ఆరోగ్య మంత్రి జాహిద్ ఆదివారం స్పష్టం చేశారు.
ఒమిక్రాన్ వైరస్ బారిన పడిన ఆ ఇద్దరు మహిళా క్రికెటర్లు.. మరో రెండు వారాల్లో పూర్తిగా కోలుకుంటారని వైద్యులు చెప్పినట్లు ఆరోగ్య మంత్రి జాహిద్ వెల్లడించారు. అయితే ఆ మహిళా క్రికెటర్ల పేర్లను బహిర్గతం చేయలేదు. బంగ్లాదేశ్ లో తొలిసారిగా ఈ రెండు ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి.
ఒమిక్రాన్ బారిన పడిన ఇద్దరు మహిళా క్రికెటర్లకు సన్నిహితంగా ఉన్న వారికీ కరోనా టెస్ట్ లు చేసినట్లు ఆరోగ్య మంత్రి జాహిద్ స్పష్టం చేశారు. ప్రస్తుతం బంగ్లా ఉమెన్ క్రికెట్ జట్టు మొత్తం క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపారు.
Also Read: Omicron scar: దేశంలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు- కర్ణాటక, నాగ్‌పూర్‌లో గుర్తింపు
Also Read: Covid19 Third Wave: దేశంలో కరోనా థర్డ్‌వేవ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook