/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Visakha Steel Plant Issue: విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం జనసేన పార్టీ గాలి తీసేసింది. విశాఖ స్టీల్‌ప్లాంట్ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలిప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి.

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖపట్నంలో జరుగుతున్న నిరసన ప్రదర్శన 3 వందల రోజులకు చేరింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఉద్యమం బలోపేతమవుతోంది. బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న జనసేన తాజాగా ఈ అంశంపై స్పందించింది. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనకు మద్దతు పలికింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశంపై లేఖ రాసినట్టు గతంలో జనసేన ప్రకటించింది. అయితే ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది.

విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్(Visakha Steel Plant) వ్యవహారంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్,  ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లకు ఇచ్చిన ప్రత్యుత్తరాలపై సమాచారం కోరుతూ విజయవాడకు చెందిన ఓ వ్యక్తి ఆర్టీఐ కింద అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఈ అంశంపై కేంద్ర ఆర్ధిక శాఖ స్పందించింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan), ప్రతిపక్ష నేత చంద్రబాబు లేఖలకు కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామనా్, ఆర్ధికశాఖ సహాయమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్‌లు బదులిచ్చారని కేంద్ర ఆర్ధికశాఖ అండర్ సెక్రటరీ తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ లేదా జనసేన నుంచి ఏ లేఖలు రాలేదని స్పష్టం చేసింది కేంద్ర ఆర్ధికశాఖ. ఇప్పుడీ విషయం సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్(Pawan Kalan letter) లేఖలకు సంబంధించి ఏ విధమైన రికార్డు కూడా లేదని తేల్చి చెప్పడంతో పవన్ కళ్యాణ్‌పై అనుమానాలు రేగుతున్నాయి. లేఖ రాయకుండా రాశానని చెప్పడంలో ఆంతర్యమేంటని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ(Bjp)పొత్తు కారణంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణా్ ఇలా వ్యవహరించారనే విమర్శలు వస్తున్నాయి. ఓ వైపు లేఖ రాయకుండా రాశానని చెప్పడం, మరోవైపు విశాఖ స్టీల్‌ప్లాంట్ వ్యవహారంలో దీక్షకు దిగడం దేనికోసమనే ప్రశ్నలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్(Pawan kalyan) స్టీల్‌ప్లాంట్ అంశంపై ఏ విధమైన లేఖ రాయలేదని కేంద్ర ఆర్ధికశాఖ తేల్చిచెప్పడం వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ వైఖరిపై అనుమానాలు రేగుతున్నాయి.

Also read: AP Corona cases: ఏపీలో స్థిరంగా కరోనా కేసులు- రాష్ట్రంలో భారీగా కొవిడ్​ టెస్టులు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Union finance ministry clarifies, no letter from pawan kayan has been received on visakha steel plant issue
News Source: 
Home Title: 

Visakha Steel Plant Issue: స్టీల్‌ప్లాంట్‌పై పవన్ కళ్యాణ్ లేఖ రాయలేదట, తేల్చిచెప్పిన

Visakha Steel Plant Issue: స్టీల్‌ప్లాంట్‌పై పవన్ కళ్యాణ్ లేఖ రాయలేదట, తేల్చిచెప్పిన కేంద్రం
Caption: 
Pawan kalyan ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Visakha Steel Plant Issue: స్టీల్‌ప్లాంట్‌పై పవన్ కళ్యాణ్ లేఖ రాయలేదట, తేల్చిచెప్పిన
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Sunday, December 12, 2021 - 09:01
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
55
Is Breaking News: 
No