Amazon offers on Premium Smartphones: కొత్త మొబైల్ కొనాలనుకుంటున్నారా? అయితే ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్లను.. తక్కువ ధరలో కొనేందుకు బెస్ట్ డీల్స్ వచ్చేశాయి. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ నిర్వహిస్తున్న ఫ్లాగ్షిప్ మొబైల్ డేస్ సేల్‌లో (Amazon FlagShip Mobile sale) భాగంగా ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది.
ఇందులో వివిధ రకాల మొబైల్ ఫోన్లపై భారీ తగ్గింపు ఇస్తోంది. ముఖ్యంగా మిడ్‌రేంజ్, ప్రీమియం సెగ్మెంట్లోని షియోమీ మొబైళ్లపై ప్రత్యేక ఆఫర్లు ఇస్తోంది అమెజాన్. ఈ ఆఫర్లను నేటితోనే ముగియనున్నాయి. మరి ఈ ఆఫర్లపై ఓ లుక్కేయండి.
షియోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ..
ఈ ఫోన్ అసలు ధర రూ.31,999 కాగా.. ఆఫర్ ధరను (బ్యాంక్ ఆఫర్‌తో కలిపి) రూ.22,999గా ఉంచింది అమెజాన్. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్, ఈఎంఐ సదుపాయాలతో కొనుగోళ్లు జరిపే వారికి మాత్రమే ఈ ఆఫర్ (Amazon offer on Xiaomi 11 lite) వర్తిస్తుంది.
ఇదిలా ఉండగా... పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా మరో రూ.5000 వరకు తగ్గింపు ఇవ్వనున్నట్లు తెలిపింది.
మీ 11 ఎక్స్ 5జీ..
ఈ మొబైల్ ఫోన్‌పై దాదాపు రూ.11 వేల వరకు తగ్గింపు (బ్యాంక్ ఆఫర్‌తో కలిపి) ఇస్తోంది అమెజాన్. దీని అసలు ధర రూ.33,999 కాగా రూ.22,999కే విక్రయిస్తున్నట్లు (Amazon offer on Mi 11 5G) తెలిపింది. ఐసీఐసీఐ డెబిట్, క్రెడిట్ కార్టును ఉపయోగించి జరిపే లావాదేవీలకు మాత్రమే పూర్తి ఆఫర్ వర్తిస్తుంది.
మరోవైపు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా రూ.5000 వరకు తగ్గింపును పొందొచ్చని వివరించింది.
మీ ఎక్స్11 ప్రో 5జీ..
ఈ మొబైల్‌పై ఏకంగా రూ.16,000 వేల వరకు తగ్గింపు ఇస్తోంది అమెజాన్. దీని అసలు ధర రూ.47,999గా ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫర్ రూ.4000 కలుపుకుని.. ఈ మొబైల్‌ను రూ.31,999కే విక్రయిస్తున్నట్లు (Amazon offer on Mi 11 Pro 5G) తెలిపింది.
ఎక్స్ఛేంజ్ ద్వారా అదనంగా మరో రూ.5000 వేల వరకు ఆదా చేసుకోవచ్చని అమెజాన్ తెలిపింది.
షియోమీలోని బడ్జెట్ ఫోన్లపై కూడా ప్రత్యేక తగ్గింపు ఇస్తోంది అమెజాన్. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో పాటు భారీ క్యాష్ బ్యాక్ కూడా అందిస్తోంది.
ఇతర ఫోన్లపై అమెజాన్ ఆఫర్లు..
శాంసంగ్ ఎం 32 5జీ మొబైల్‌పై రూ.3 వేల వరకు తగ్గింపు ఇస్తోంది అమెజాన్. 6 జీబీ ర్యామ్, 128 స్టోరేజీ వేరియంట్ ధర రూ.23,999 కాగా.. ఈ ఆఫర్లో దీని ధరను రూ.20,999గా ఉంచింది. వన్ ప్లస్, లావా సహా ఇతర బ్రాండ్ల మొబైళ్లపైనా డిస్కౌంట్ ఇస్తోంది.
Also read: LPG Booking Offer: పేటీఎంలో గ్యాస్ బుక్ చేస్తే రూ.2700 క్యాష్‌బ్యాక్- పే లేటర్ ఆప్షన్ కూడా!
Also read: SBI personal loan : సులువుగా పర్సనల్ లోన్, నిమిషాల్లో అకౌంట్లో డబ్బు జమ, ప్రాసెసింగ్ ఫీజు లేదు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook