Bandla Ganesh adopted girl child: టాలీవుడ్ నిర్మాత, కమెడియన్ బండ్ల గణేష్ (Bandla Ganesh) గొప్ప మనసు చాటుకున్నారు. ఆయన ఓ నేపాలీ చిన్నారిని దత్తత తీసుకున్నారు. పేదరికం కారణంగా ఆ చిన్నారికి ఆమె తల్లి తిండి కూడా పెట్టలేని పరిస్థితిలో ఉండటం చూసి చలించిపోయారు. తన భార్య సూచన మేరకు ఆ చిన్నారిని దత్తత తీసుకున్నారు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ (Bandla Ganesh interview) స్వయంగా ఈ విషయం వెల్లడించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ (Bandla Ganesh) మాట్లాడుతూ.. 'ఈ అమ్మాయి ఎక్కడో నేపాల్‌లో (Nepal) పుట్టింది. నెల రోజుల వయసున్నప్పుడు మా ఇంటికి వచ్చింది. నాకు నా కూతురెంతో ఈ చిన్నారి కూడా అంతే. నాకు విచిత్రమనిపిస్తుంటుంది.. కొంతమంది కుక్క పిల్లలను పెంచుకుంటారు... వాటి కోసం ఎంతో ఖర్చు చేస్తారు. ఈ చిన్నారిని మొదటిసారి చూసినప్పుడు మా ఆవిడ ఆమె వద్దకు వెళ్లి అడిగిందట... చిన్నారికి ఏ ఆహారం పెడుతున్నావని. ఏం లేవమ్మా... నా పాలే ఇస్తున్నానని చెప్పిందట. అది రాత్రి సమయం... చిన్నారి ఏడుస్తోంది. అప్పుడు మా ఆవిడ నాతో చెప్పింది... ఈ చిన్నారిని నువ్వు తీసుకోమని. ఈరోజు మా ఇంట్లో వాళ్లందరినీ రేయ్ అనే స్థాయికి వచ్చింది. మా కొడుకులను కూడా డిక్టేట్ చేస్తుంది.' అని నవ్వుతూ చెప్పుకొచ్చారు.
ఆ చిన్నారిని గొప్పగా చదివించాలనుకుంటున్నానని బండ్ల గణేష్ (Bandla Ganesh) చెప్పారు. బండ్ల గణేష్ నేపాలీ చిన్నారిని దత్తత తీసుకున్నాడనే విషయం తెలిసి చాలామంది నెటిజన్లు ఆయన్ను అభినందిస్తున్నారు. ప్రస్తుతం బండ్ల గణేష్ 'డేగల బాబ్జీ' అనే చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. తమిళ సినిమా 'ఒత్తు సెరుప్పు సైజ్ 7' చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్‌ను దర్శకుడు పూరి జగన్నాథ్ విడుదల చేశారు. సుమారు 2నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌లో ఆద్యంతం బండ్ల గణేష్ ఒక్కరే కనిపించారు. ఆయన నటన, హావభావాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. వెంకట్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
@ganeshbandla అన్న నిన్ను నిందించి అగౌరవ పారిచే అంతా స్థాయి, స్థానం ఈ ఆంధ్రాలో ఏ ఒక్కడికి సరిపోదు అన్న.....🙏💯 pic.twitter.com/w0FDBDDH68
— Rock ⭐ Rockey🔥👑 (@RavitejanaiduS2) November 27, 2021
Also Read: బిగ్‌బాస్ సీజన్ 5 లో ఎలిమినేట్ అయింది యాంకర్ రవినా..పెరుగుతున్న ట్రోలింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook