BJP MP Gautam Gambhir has allegedly received a third death threat mail from ISIS Kashmir: మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌కు మరోసారి బెందిరుంపు ఈ-మెయిల్ (Threat mail from ISIS Kashmir) వచ్చింది. గంభీర్కుకు బెదిరింపు మెయిల్స్ రావడం ఈ వారంలో ఇది మూడో సారి.
నవంబర్ 23 గంభీర్‌కు తొలి బెదిరింపు ఈ-మెయిల్ (Threat mail to Gautam Gambhir) వచ్చింది. ఐఎఎస్ఐస్ కశ్మీర్ (ISIS Kashmir) పేరుతో వచ్చిన ఈ-మెయిల్లో గంభీర్‌ను చమపుతామంటూ పేర్కొన్నట్లు తెలిసింది. మరుసటి రోటు మరో అదే ఐడీ నుంచి మరో ఈమెయిర్ రాగా.. అందులో గంభీర్ ఇంటికి సంబంధించి ఓ వీడియో ఉంది.
'ఈ రోజు తప్పించుకున్నావు.. ప్రాణాలు దక్కాలంటే రాజకీయాలకు, కశ్మీర్ అంశానికి దూరంగా ఉండాలంటూ మెయిల్ పంపిన ఉగ్రవాది అందులో పేర్కొన్నాడు.
ఈ విషయంపై గంభీర్ ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఢిల్లీ సెంట్రల్ పోలీస్ కమిషనర్ స్వేతా చౌహాన్.. వేగంగా దర్యాప్తు (Delhi Police on Threat mails to Gambhir) చేపట్టారు. ముందస్తు చర్యల్లో భాగంగా గంభీర్ ఇంటివద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు ఢిల్లీ పోలీసులు. ఈ-మెయిల్ ఐడీని ట్రేస్ చేసేందుకు గూగుల్ సహాయం కూడా తీసుకున్నారు.
మెయిల్ పంపిన వ్యక్తి వివరాలు ఇవే..
గూగుల్ ఇచ్చిన వివరాలతో మెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించారు ఢిల్లీ పోలీసులు. అతడు పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. వయసు 25-26 మధ్య ఉంటుందని.. అతడు కరాచీలోని సింధ్ యూనివర్సిటీలో చదువుతున్నట్లు తెలుసుకున్నారు. ఆ వ్యక్తికి గంభీర్ ఇంటి వీడియో ఎలా దొరికింది.. మెయిల్ ఐటీ ఎలా తెలుసుకున్నాడు.. అనే విషయాలు తెలుసుకునేందుకు.. పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఈ దర్యాప్తు జరుగుతుండగానే.. తాజాగా (శనివారం) మూడో ఈమెయిల్ వచ్చింది. ఈ సారి ఈ-మెయిల్లో.. ఢిల్లీ పోలీసులు కూడా కాపాడలేరు అంటూ గంభీర్‌ను బెదిరించినట్లు తెలిసింది. ఈ మెయిల్లో కమిషనర్ స్వేతా చౌహాన్ పేరును కూడా ప్రస్తావించినట్లు తెలిసింది.
గంభీర్‌కు ఈ-మెయిల్ అందుకేనా?
పంజాబ్ పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ.. ఇటీవల కర్తార్‌పూర్ కారిడార్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సిద్దూ.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తనకు పెద్దన్న లాంటి వాడని చెప్పుకొచ్చారు. ఈ విషయంపై పెద్ద ఎత్తున దుమారం రేగింగి. ఈ విషయంపై స్పందించిన గౌతమ్ గంభీర్ సిద్దూ వ్యాఖ్యలను తప్పుబట్టారు. పాకిస్థాన్ ఉగ్రవాద దేశమని అభివర్ణించారు. ఈ ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే గంభీర్‌ను పాక్ ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
Also read: Road accident: పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం-18 మంది మృతి
Also read: భారీ వర్షాలతో వరద ముంపులో తమిళనాడు దృశ్యాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook