Bike On Fire In Adilabad: చలాన్లు వేస్తున్నారని నడిరోడ్డుపై బైక్‌ తగలబెట్టిన వ్యక్తి

Angry over e challans man sets bike on fire : ఆదిలాబాద్‌ పట్టణంలోని ఖానాపూర్‌కు చెందిన మక్బూల్‌ స్థానిక అంబేడ్కర్‌ కూడలి సమీపంలోబైక్‌పై వెళ్తుండగా.. ట్రాఫిక్‌ పోలీసులు ఫొటో తీసి ఈ-చలానా కింద జరిమానా వేశారు. దీంతో అసహనానికి గురైన వాహనదారుడు తరచూ ట్రాఫిక్ పోలీసులు ఇలా ఫోటోలు తీసి ఈ- చలాన్లు వేస్తున్నారంటూ నడిరోడ్డుపైనే తన బైక్‌కు నిప్పు పెట్టాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 27, 2021, 03:03 PM IST
  • ఆదిలాబాద్‌ జిల్లాలో ట్రాఫిక్‌ పోలీసుల తీరును నిరసిస్తూ బైక్‌కు నిప్పు
  • ఫొటో తీసి ఈ-చలాన్ కింద జరిమానా వేసిన ట్రాఫిక్‌ పోలీసులు
  • అసహనానికి గురై నడిరోడ్డుపైనే తన బైక్‌కు నిప్పు పెట్టుకున్న వ్యక్తి
Bike On Fire In Adilabad: చలాన్లు వేస్తున్నారని నడిరోడ్డుపై బైక్‌ తగలబెట్టిన వ్యక్తి

Upset Over E-Challans, Man Sets His Bike On Fire In Adilabad: ఒక పక్క పెట్రోల్‌ ధరలు బాగా పెరిగిపోయాయి.. మరోవైపు ట్రాఫిక్‌ చలానాలతో వాహనదారులు భయపడిపోతున్నారు. బండి రోడ్డు ఎక్కిందంటే ఎక్కడ ట్రాఫిక్ పోలీస్ కెమెరాకు చిక్కుతుందోనని హడలెత్తిపోతున్నారు వాహనదారులు. ఎక్కడ ఫోటో తీసి ఇ‌‌-చలాన్‌ (E-Challans) పంపిస్తారేమోనని భయపడిపోతున్నారు. అయితే ఈ క్రమంలో ఆదిలాబాద్‌ జిల్లాలో ఓ వ్యక్తి ట్రాఫిక్‌ పోలీసులకు (Traffic Police) షాకి చ్చాడు. ట్రాఫిక్‌ పోలీసుల తీరును నిరసిస్తూ బైక్‌కు నిప్పు పెట్టాడు. 

Also Read : Acharya OTT Rights: ‘ఆచార్య’ సినిమా కోసం పోటీపడుతున్న ప్రముఖ ఓటీటీ సంస్థ

ఆదిలాబాద్‌ పట్టణంలోని ఖానాపూర్‌కు చెందిన మక్బూల్‌ స్థానిక అంబేడ్కర్‌ కూడలి సమీపంలోబైక్‌పై వెళ్తుండగా.. ట్రాఫిక్‌ పోలీసులు ఫొటో తీసి ఈ-చలాన్ (E-Challans) కింద జరిమానా వేశారు. దీంతో అసహనానికి గురైన వాహనదారుడు తరచూ ట్రాఫిక్ పోలీసులు ఇలా ఫోటోలు తీసి ఈ- చలాన్లు వేస్తున్నారంటూ నడిరోడ్డుపైనే తన బైక్‌కు నిప్పు పెట్టాడు. దీంతో రోడ్డుపై ఉన్నవారంతా విస్తుపోయారు. వెంటే అక్కడున్నవారు, పోలీసులు (Police) వచ్చి మంటలను ఆర్పేశారు. అయినా అప్పటికే బైక్ డ్యామేజ్ అయింది.

Also Read : KS Bharat: వచ్చీరాగానే సూపర్ క్యాచ్ అందుకున్న భరత్.. రహానేని ఒప్పించి మరీ (వీడియో)!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News