IND VS NZ 1st Test: కివీస్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర సరికొత్త రికార్డు

Rachin Ravindra: కివీస్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర సరికొత్త రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్ తరుపున అరంగ్రేటం చేసిన పిన్నవయస్కుడిగా నిలిచాడు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 25, 2021, 04:30 PM IST
IND VS NZ 1st Test: కివీస్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర సరికొత్త రికార్డు

Rachin Ravindra: వెల్లింగ్‌టన్ ఫైర్‌బర్డ్స్  ఆల్ రౌండర్  రచిన్ రవీంద్ర(Rachin Ravindra) సరికొత్త రికార్డు సృష్టించాడు. భారత్‌(India)తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో న్యూజిలాండ్(New Zealand) తరుపున అరంగ్రేటం చేసిన పిన్నవయస్కుడిగా రవీంద్ర నిలిచాడు. ఇప్పటివరకు 2013లో బంగ్లాదేశ్‌పై అరంగేట్రం చేసిన ఇష్‌ సోధి(Ish Sodhi) అతి పిన్న వయస్కుడిగా ఉన్నాడు. 

22 ఏళ్ల రచిన్ రవీంద్రకు తన సహచర ఆటగాడు టామ్ బ్లండెల్ టెస్ట్  క్యాప్(282)ను అందించాడు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. అజాజ్ పటేల్, రచిన్ రవీంద్ర, ఇష్‌ సోధి భారతీయ మూలాలు కలిగి ఉన్న వ్యక్తులు. అయితే వరల్డ్‌ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌(2021-2023) లో న్యూజిలాండ్‌కు ఇదే తొలి మ్యాచ్‌. తొలి వరల్డ్‌ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ట్రోఫీ(World Test ChampionShip)ని విలియమ్సన్‌ సారథ్యంలోని న్యూజిలాండ్‌ జట్టు గెలుచుకున్న సంగతి తెలిసిందే.

Also Read:IND vs NZ 1st Test: మయాంక్ విఫలమయినా.. చెలరేగిన గిల్! లంచ్ బ్రేక్ సమయానికి భారత్ స్కోర్ ఎంతంటే?

నిలకడగా ఆడుతున్న భారత్
న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టు(IND VS NZ 1st Test)లో టీమిండియా టీ విరామ సమయానికి 56 ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి...154 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నారు. గిల్ 52 పరుగులతో రాణించాడు. మయాంక్ 13 పరుగులు,  పూజారా 26 పరుగులు, రహానే 35 రన్స్ చేసి ఔటయ్యారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News