SRCP Leader Perni Nani Sleeping in Assembly: ఏపీ మూడు రాజధానుల చట్టాన్ని (Ap Three Capitals Bill) రద్దు చేస్తూ రాష్ట్ర కేబినెట్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం నేపధ్యంలో మూడు రాజధానుల చట్టం ఉపసంహరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది జగన్ ప్రభుత్వం. ఉపసంహరణ బిల్లుపై చర్చకు స్పీకర్ తమ్మినేని సీతారామ్(Tammineni Sitaram) అనుమతించడంతో మంత్రి బుగ్గన ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి బుగ్గన (Buggana Rajendranath) కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితమైతై వేర్పాటు వాదం వస్తుందని శ్రీకృష్ణకమిటీ చెప్పిన సంగతి గుర్తు చేశారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాలని శ్రీకృష్ణ కమిటీ చెప్పిందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని శివరామకృష్ణన్ కమిటీ (Shivaramakrishnan Comity) స్పష్టం చేసిందని తెలిపారు. బిల్లుపై చర్చ అనంతరం మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం తెలిపింది.
Also Read: చిరుత Vs పాము.. 'తాడి తన్నేవాడుంటే వాడి తల తన్నే వాడుంటాడు' అంటే ఇదే! వైరల్ వీడియో
అసెంబ్లీ మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ జరుగుతున్న సమయంలో కీలక అంశాలను మంత్రి బుగ్గన స్పీకర్ కు తెలుపుతుండగా.. వెనుకాల కూర్చున్న మంత్రి పేర్ని నాని (Perni Nani) నిద్రపోయిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 3 రాజధానుల బిల్లు ఉపసంహరణ దేశంలోనే సంచలనం రేపిన సంగతి తెలిసిందే! అసెంబ్లీ లో ఈ బిల్లు ప్రవేశపెట్టిన బుగ్గన చెప్తున్న స్పీచ్ సమయంలో పేర్ని నాని కునుకు తీయటం విమర్శలకు దారితీస్తుంది.
ఇంత సీరియస్ మ్యాటర్ గురించి చర్చ జరుగుతుంటే.. మంత్రి హోదాలో ఉన్న పేర్నినాని పడుకున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పడుకున్న పేర్నినాని తూలి పడబోవటం దానిని కవర్ చేయటానికి ఆయన చేసిన ప్రయత్నాలన్నీ రికార్డ్ అవ్వటం.. అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read: 3 రాజధానుల బిల్లు ఉపసంహరణకు కారణం ఏంటి..? జగన్ ప్రభుత్వం ముందున్న 4 ఆప్షన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook