యూజర్ల రక్షణకై ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను, కొత్త విధానాలను ప్రవేశపెడుతున్న వాట్సప్..ఇప్పుడు మరో కొత్త పీచర్ ప్రారంభించించి. ఇక నుంచి వాట్సప్ వెబ్‌లో కూడా అందుబాటులోకి రానుంది.
ఇన్స్టంట్ మెస్సేజింగ్ యాప్‌గా ప్రాచుర్యంలో ఉన్న వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో(Whatsapp New Feature)యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు మరో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ ప్రొఫైల్ పిక్‌ను, స్టేటస్‌ను ఎవరు చూడవచ్చు, ఎవరు చూడకూడదనేది నిర్ణయించుకోవచ్చు. వినియోగదారుల రక్షణకై వాట్సప్ కొత్తగా మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ ఫీచర్ ప్రవేశపెట్టింది. ఇప్పటికే వాట్సప్ బీటా వెర్షన్లలో ఈ ఫీచర్ ప్రారంభం కాగా. కొత్తగా వాట్సప్ వెబ్ , ఇతర వినియోగదారులకు కూడా అందించేందుకు సిద్ధమైంది. కొత్త వెర్షన్ 2.2146.5తో ఈ ఫీచర్‌ను వెబ్, డెస్క్‌టాప్ వినియోగదారులకు అందుబాటులో తెచ్చింది.
ఈ కొత్త ఫీచర్ ఏంటి
ఈ ఫీచర్ ద్వారా వాట్సప్‌లో(Whatsapp)స్టేటస్ లేదా ప్రొఫైల్ ఫోటోను ఎవరు చూడవచ్చు, ఎవరు చూడకూడదో నిర్ణయించవచ్చు. దీంతో యూజర్ల డేటాకు మరింత రక్షణ లభిస్తుంది.ప్రైవసీ సెట్టింగ్ కింద ఈ ఫీచర్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. యాప్‌లో ఇప్పటికే మూడు ఆప్షన్లు ఉన్నాయి. ఇది కొత్త ఫీచర్. వాట్సప్ ఆండ్రాయిడ్ వెర్షన్లో ఇటీవల కొత్తగా షార్ట్ కట్ విడుదలైంది. ఎవరైనా ఇతరులు షేర్ చేసిన స్టేటస్ అప్డేట్ చూస్తున్నప్పుడు వీడియా కాల్ చేసేందుకు అనుమతి లభిస్తుంది. ఈ షార్ట్ కట్స్‌ను యాక్సెస్ చేసేందుకు స్క్రీన్ కుడివైపున ఎగువ భాగంలో ఉన్న మూడు చుక్కల్ని ప్రెస్ చేయాలి. మెనూలో వీడియో కాల్ ఎంపి చేసుకుని ఒకేసారి రెండు ఫీచర్లు వినియోగించుకోవచ్చు. గతంలో అయితే ఈ ఆప్షన్‌తో కేవలం వాయిస్ కాల్ మాత్రమే వీలుండేది. కొత్త ఆప్‌డేట్‌తో వీడియా కాల్ సౌకర్యం లభించింది.
Also read: వైరల్ వీడియో: గాయనిపై బకెట్లతో డబ్బుల వర్షం కురిపించారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook