రేపు ఢిల్లీకి తెలంగాణ సీఎం కేసీఆర్‌.. కేంద్రానికి మూడు డిమాండ్లు

 తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వరిధాన్యం కొనుగోలు మీద జరుగుతోన్న వ్యవహారంలో నిరంతరంగా డిమాండ్‌ చేసినా కేంద్రం నుంచి స్పందన లేదన్నారు. కేంద్రం నుంచి KCR three demands to Central government :ఎలాంటి సమాధానం రావట్లేదు అన్నారు. మేం కోరిందల్లా ఏదంటే.. అన్ని రాష్ట్రాల నుంచి ధాన్యం సేకరించినట్లే తెలంగాణ (Telangana) నుంచి సేకరిస్తరు కాబట్టి.. సంవత్సరం టార్గెట్‌ ఇవ్వండి అని సీఎం అన్నారు. సంవత్సరం టార్గెట్‌ ఇస్తే దాన్ని బట్టి రాష్ట్రంలో సర్దుబాటు చేయాల్సి ఉంటుందని అక్కరుంటదని కోరామని కేసీఆర్ (Telangana CM KCR) పేర్కొన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 20, 2021, 08:16 PM IST
  • యాసంగిలో ధాన్యం కొనుగోలుతో కేంద్రంతో తేల్చుకుంటాం..
  • వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం వెన‌క్కి తీసుకోవ‌డం రైతు విజ‌యం
  • రైతు ఉద్యమ సమయంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు కేంద్రం రూ.25లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
  • విద్యుత్‌ చట్టం బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోవాలి
  • క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర చ‌ట్టం తీసుకొని రావాలి
  • తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్పష్టీకరణ
రేపు ఢిల్లీకి తెలంగాణ సీఎం కేసీఆర్‌.. కేంద్రానికి మూడు డిమాండ్లు

Telangana CM KCR Press meet at Telangana Bhavan KCR three demands to Central government : యాసంగిలో ధాన్యం కొనుగోలుతో కేంద్రంతో తేల్చుకుంటామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. శనివారం రాత్రి ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరి గురించి ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వరిధాన్యం కొనుగోలు మీద జరుగుతోన్న వ్యవహారంలో నిరంతరంగా డిమాండ్‌ చేసినా కేంద్రం నుంచి స్పందన లేదన్నారు. కేంద్రం నుంచి ఎలాంటి సమాధానం రావట్లేదు అన్నారు. మేం కోరిందల్లా ఏదంటే.. అన్ని రాష్ట్రాల నుంచి ధాన్యం సేకరించినట్లే తెలంగాణ (Telangana) నుంచి సేకరిస్తరు కాబట్టి.. సంవత్సరం టార్గెట్‌ ఇవ్వండి అని సీఎం అన్నారు. సంవత్సరం టార్గెట్‌ ఇస్తే దాన్ని బట్టి రాష్ట్రంలో సర్దుబాటు చేయాల్సి ఉంటుందని అక్కరుంటదని కోరామని కేసీఆర్ (Telangana CM KCR) పేర్కొన్నారు. మొన్న ధర్నా చేసిన రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని.. మాట్లాడుతామని అన్నారని... చివరి ప్రయత్నంగా రేపు ఢిల్లీకి (Delhi) వెళ్తున్నమని కేసీఆర్ చెప్పుకొచ్చారు. 

రైతులకు ఏదో ఒకటి తేల్చకపోతే వారు కన్ఫ్యూజన్‌లో ఉంటారని కేసీఆర్ పేర్కొన్నారు. అనవసరమైన ఇబ్బందులు చాలా వచ్చే అవకాశం ఉంటదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో (Telangana State Government) ధాన్యం కొనుగోలు మీద మాట్లాడుతామని, బాయిల్డ్‌ రైస్‌ కొనమని చెప్పినట్లు వార్త వచ్చిందని.. మరి అధికారికమా? కాదా? అడిగి తేల్చుకునేందుకు ఢిల్లీకి వెళ్తున్నామని కేసీఆర్‌‌ తెలిపారు. బహుశా ఈ చర్చలకు రెండు రోజులు పట్టొచ్చని.. దాని తర్వాత తెలంగాణ రైతాంగానికి విషయం ఏమిటనేది తెలుపుతామని సీఎం కేసీఆర్‌ (CM KCR‌) స్పష్టం చేశారు. 

ఇక భార‌త రైతాంగం గొప్ప విజ‌యం సాధించింద‌న్నారు. వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం వెన‌క్కి తీసుకోవ‌డం రైతు విజ‌యం అని స్ప‌ష్టం చేశారు. అలాగే రైతుల ఉద్య‌మ స‌మ‌యంలో చాలామంది రైతుల‌పై (farmers) కేంద్రం దేశ‌ద్రోహం లాంటి కేసులుపెట్టింద‌ని.. ఆ కేసుల‌ను వెంట‌నే కేంద్రం ఎత్తివేయాల‌ని కేసీఆర్ కోరారు. ఇక రైతుల విషయంలో కేంద్రం దుర్మార్గంగా వ్యవహరించిందని.. సాగు చట్టాల కోసం ఉద్యమించి అమరులైన అన్నదాతల కుటుంబాలను కేంద్రం ఆదుకోవాలని అన్నారు. ఈ ఉద్యమ సమయంలో సుమారు 700 నుంచి 750మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని.. ప్రతి రైతు కుటుంబానికి కేంద్రం రూ.25లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా (Rs 25 lakh ex gratia) ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Also Read : తెలంగాణ: అంగన్‌వాడీలో కలెక్టర్ పిల్లలు...సర్వత్రా ప్రశంసలు..

ఉద్యమంలో అమరులైన రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana State Government) తరఫున ఒక్కో కుటుంబానికి రూ.3లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించామని చెప్పారు. ఇందుకు ₹22.5కోట్లు ఖర్చవుతుందన్నారు.ఇక తెలంగాణలో వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని చెప్పుకొచ్చారు కేసీఆర్. విద్యుత్‌ చట్టం (Electricity Act) తెచ్చి వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి చేస్తోందని.. దీనిపై రైతులు చాలా ఆందోళనతో ఉన్నారని కేసీఆర్ చెప్పారు. బీజేపీ (BJP) పాలిత రాష్ట్రాల్లో మీ నిర్ణయాన్ని అమలు చేసుకోండి కానీ, అన్ని రాష్ట్రాల్లో మీటర్లు పెట్టాలని ఆదేశించడం సమంజసం కాదని తేల్చి చెప్పారు తెలంగాణ సీఎం. పార్లమెంట్‌లో (Parliament‌) విద్యుత్‌ చట్టం బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే బిల్లు పాస్‌ కాకుండా లోక్‌సభ, రాజ్యసభలో పోరాడతామన్నారు. 

తాము అడిగేది మూడే అని కేసీఆర్ మూడు డిమాండ్లు వెల్లడించారు. ఒక‌టి చ‌నిపోయిన‌టువంటి ప్ర‌తి రైతు కుటుంబానికి 25 ల‌క్ష‌లు... రెండోది.. రైతుల‌పై న‌మోదైన కేసుల‌న్నీ (All cases) ఎత్తేయాలి... మూడోది.. క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర చ‌ట్టం తీసుకొని రావాలి.. అని కేసీఆర్ పేర్కొన్నారు. ప్ర‌తి రైతు అడుగుతున్న‌ది మినిమ‌మ్ స‌పోర్ట్ ప్రైస్‌.. (Minimum Support Price) మాగ్జిమ‌మ్ స‌పోర్ట్ ప్రైస్ అడుగుత‌లేరని కేసీఆర్‌‌ తెలిపారు. దాదాపు 15 కోట్ల రైతు కుటుంబాలు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ను డిమాండ్ చేస్తున్నాయని.. వ‌చ్చే పార్ల‌మెంట్ స‌మావేశంలోనే ఆచ‌ట్టాన్ని పెట్టాలని కేసీఆర్ (KCR) కోరారు.

Also Read : తెలంగాణకు రాబోయే 3 రోజులు వర్ష సూచన... తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook 

Trending News