MLC Notification: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ నగారా మోగడమే కాకుండా రేపటి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. నోటిఫికేషన్ వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికల సందడి మరోసారి ప్రారంభమైంది. తెలంగాణ స్థానిక సంస్థల కోటాలో పన్నెండు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్(Mlc Notification) విడుదలైంది.రేపటి నుంచి అంటే నవంబర్ 17 నుంచి నవంబర్ 23 వరకూ నామినేషన్లు స్వీకరించనున్నారు. 24వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నవంబర్ 26న నామినేషన్ ఉపసంహరణకు గడువుగా ఉంది. డిసెంబర్ 10 వ తేదీన పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 14వ తేదీన కౌంటింగ్ ఉంటుంది.
ఆదిలాబాద్ జిల్లాలో ఒకటి, వరంగల్ ఒకటి నల్గొండ ఒకటి, మెదక్ ఒకటి, నిజామాబాద్ ఒకటి, ఖమ్మం ఒకటి, కరీంనగర్ రెండు, మహబూబ్ నగర్ రెండు, రంగారెడ్డి జిలాలో రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నిక జరగనుంది. 2021 జనవరి వరకూ పదవీకాలం ఉండటంతో అప్పట్నించి మాత్రమే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీల పదవీకాలం పరిగణలో వస్తుంది. అటు ఎమ్మెల్యే కోటాలో 6 స్థానాలకు తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. వీటికి నామినేషన్లు ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యేల బలం అధికారపార్టీ టీఆర్ఎస్కు(TRS)ఎక్కువగా ఉండటంతో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు టీఆర్ఎస్ పరం కానున్నాయి. కడియం శ్రీహరి, బండ ప్రకాశ్, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, పాడి కౌషిక్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, వెంకట్రామిరెడ్డిలను టీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్ధులుగా ఖరారు చేసింది.
అటు ఆంధ్రప్రదేశ్‌లో(Ap Mlc Elections)మూడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వెలువడింది. ఇందులో భాగంగా ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడింది. నవంబర్ 17 నుంచి నామినేషన్ల పరిశీలన, నవంబర్ 22న ఉపసంహరణ, నవంబర్ 29న పోలింగ్ ఉంటుంది. అదే రోజు కౌంటింగ్ ఉంటుంది. మే 31వ తేదీతో మండలి మాజీ ఛైర్మన్ మొహమ్మద్ షరీఫ్, బీజేపీకు చెందిన సోము వీర్రాజు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు చెందిన గోవింద రెడ్డిల పదవీకాలం ముగియడంతో ఈ ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు శాసన మండలిలో 14 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. స్థానిక సంస్థల నుంచి 11, ఎమ్మెల్యే కోటా నుంచి మరో 3 స్థానాలకు జరగాల్సిన ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ఇంకా విడుదల కావల్సి ఉంది.
Also Read: TRS MLC Candidates: ఎమ్మెల్యే కోటా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook