A woman was raped and forced to bear a child by a couple: సంతానం కోసం ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ఓ 21 ఏళ్ల యువతిని బందించి 16 నెలల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇందుకు అతడి భార్య కూడా సహకరించడం గమనార్హం.
తిరా ఓ బిడ్డకి జన్మనిచ్చిన తరువాత బాధితురాలని దగ్గర్లోని ఓ బస్టాప్ దగ్గర వదిలి వెళ్ళారు ఆ దంపతులు.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో చోటు చేసుకుంది ఈ అమానుష ఘటన.
Also read: Tamilnadu Lady Police: వరద బాధితులను భుజాలపై ఎత్తుకెళ్లిన మహిళా పోలీస్..
పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉజ్జయినీలోని కధ్ బరోడా గ్రామానికి చెందిన ఆ గ్రామ మాజీ ఉప సర్పంచ్ రాజ్‌పాల్ సింగ్, చంద్రకాంత దంపతులు తమకు పుట్టిన పిల్లలను చిన్న వయసులోనే కోల్పోయారు. దీనితో సంతానం కోసం అడ్డదారిని ఆశ్రయించారు.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో.. ఓ మహిళ ద్వారా బాధితురాలిని (Human Trafficking) కొనుగోలు చేశారు ఆ దంపుతులు. అమెపై రాజ్‌పాల్ సింగ్ పలు మార్లు అత్యాచారం ల(Ujjain Rape Case) చేశాడు. దీనితో ఆమె గర్భం దాల్చింది. గత నెల 25న ఓ బిడ్డకు జన్మనిచ్చింది (Nagpur Women raped) ఆ యువతి. అయితే ఈనెల 6న ఆపస్మారక స్థితిలో ఉన్న ఆ బాధిత యువతిని దేవాస్ బస్‌స్టాప్ వద్ద వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు రాజ్‌పాల్ సింగ్ దంపతులు.
Also read: General Bipin Rawat: 'పాకిస్థాన్ కంటే చైనాతోనే భారత్‌కు ఎక్కువ ముప్పు'
చాలా సేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. దీనితో ఆమె చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు ఆ దంపతులు, సహా ఇందుకు సహకరించినవారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు రాజ్‌పాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనితో పాటు యువతిని విక్రయించిన మహిళ వివరాలను సేకరించే పనిలో పడ్డారు. ఇందుకోసం ఓ పోసీల్ బృందాన్ని నాగ్‌పూర్ పంపించారు.
రాజ్‌పాల్‌తో పాటు.. ఇందుకు సహకరించిన అతడి బంధువులు విరేంద్ర పాల్, అర్జున్లపై ఐపీసీ సెక్షన్ 370 (మానవ అక్రమ రవాణా), 376 (అత్యాచారం), 376 ఏ, 365 (కిడ్నాపింగ్), 377 (అసహజ శృంగారం), 506 కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.
Also read: Sabarimala Temple Opening: నవంబరు 16 నుంచి శబరిమల అయ్యప్ప దర్శనం.. భక్తులు పాటించాల్సిన నియమాలివే..
Also read: Covid-19 Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. స్పెషల్ ట్రైన్స్ రద్దు చేయనున్న రైల్వేశాఖ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook