కర్నూలు నుంచి బీజేపీ నేతలు తాజాగా ప్రకటించిన రాయలసీమ డిక్లరేషన్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. రాయలసీమను గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి చేశామని cచెప్పారు. కనీవినీ ఎరుగని రీతిలో సీమకు నీటి అవసరాలు అందించామని అన్నారు. తాను కూడా రాయలసీమ బిడ్డనే అన్నారు. ఇప్పుడు బీజేపీకి రాయలసీమ గుర్తొచ్చిందా? అని ప్రశ్నించిన ఆయన.. రాయలసీమ పేరుతో బీజేపీ డ్రామాలాడుతోందంటూ మండిపడ్డారు.
కర్నూలులో సుప్రీంకోర్టు బెంచ్, అమరావతిని దేశ రెండో రాజధానిగా ఏర్పాటు చేస్తే... అప్పుడు బీజేపీ చిత్తశుద్ధి ఏమిటో అందరికీ అర్థమవుతుందని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము పోరాడుతుంటే.. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న బీజేపీ రాయలసీమ పేరుతో నాటకాలాడుతోందని విమర్శించారు. టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించినప్పుడు పైవిధంగా స్పందించారని సమాచారం. బీజేపీ నేతలపై వ్యక్తిగత విమర్శలకు దిగవద్దని సూచించారాయన. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే విషయంలో టీడీపీ నేతలు అనుసరించాల్సిన వైఖరిపై ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు.
కర్నూలులో సుప్రీం బెంచ్ ఏర్పాటు చేయండి