అతిలోక సుందరి శ్రీదేవి హఠాన్మరణం ఆమె అభిమానులకు ఓ ఊహించని షాక్ అయితే, ఆమె మృతిచెందడానికన్నా కన్నా కొద్ది ముందుగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేసిన ఓ ట్వీట్ నెటిజెన్స్ని మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా తనకు ఎదురైన అనుభవాలను, తన భావాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకునే అమితాబ్.. శ్రీదేవి చనిపోవడానికి కూడా కొద్ది ముందుగా ఓ ట్వీట్ చేశారు. " ఎందుకో ఏమో తెలియదు కానీ మనసంతా ఏదో కంగారుగా, ఆందోళనగా వుంది " అని అమితాబ్ ట్వీట్ చేయడం ఆయన అభిమానులని కొంత కలవరపాటుకు గురిచేసింది. ఇంతలోనే బాలీవుడ్ నటి శ్రీదేవి ఇక లేదు అనే చేదు వార్త వినిపించడం నిజంగానే అమితాబ్, శ్రీదేవి అభిమానులను, నెటిజెన్స్కి అమితాశ్చర్యానికి గురిచేసింది.
T 2625 - न जाने क्यूँ , एक अजीब सी घबराहट हो रही है !!
— Amitabh Bachchan (@SrBachchan) February 24, 2018
అమితాబ్ చేసిన ఈ ట్వీట్ చూసి అప్పటికే ఆలోచనలో పడిన ఆయన అభిమానులు.. శ్రీదేవి మృతి వార్త తెలియగానే, "బచ్చన్ సాబ్, మీ భయమే నిజమైంది" అని బదులిచ్చారు. మీకు తెలియకుండానే మీ సిక్త్ సెన్స్ ఈ కీడుని శంకించింది అంటూ నెటిజెన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు.
Just now bachan sir twitted that he's feeling some negative vibes and just 20 min later SRI DEVI passed away #RIPSridevi
— Mohd Suhail (@SoHail2502) February 24, 2018
Sir, aapki ghabrahat wajib thi, Ek chamakte sitare k doobjane ki Aahat si thi #Sridevi RIP
— Pankaj Nagarkoti (@PankNagarkoti) February 24, 2018
Extreme premonition!! Some things are still beyond all scientific explanations. RIP SriDevi Ji.
— THE SKIN DOCTOR (@theskindoctor13) February 24, 2018