Shocking: Youtube వీడియోలు చూస్తూ.. బిడ్డకు జన్మనిచ్చిన మైన‌ర్ బాలిక‌! లవర్ అరెస్ట్

ఓ మైనర్ బాలిక యూట్యూబ్ వీడియో చూసి..ఇంట్లోనే బిడ్డకు జన్మనిచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘ‌ట‌న కేర‌ళ రాష్ట్రం మ‌ల‌ప్పురం జిల్లాలో చోటుచేసుకుంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 28, 2021, 11:28 AM IST
Shocking: Youtube వీడియోలు చూస్తూ.. బిడ్డకు జన్మనిచ్చిన మైన‌ర్ బాలిక‌! లవర్ అరెస్ట్

Kerala News: ఓ 17 బాలిక యూట్యూబ్‌ వీడియో(YouTube Videos) సాయంతో సొంతంగా ఇంట్లోనే బిడ్డకు జన్మనిచ్చిన ఘటన కేరళలోని మలప్పురం జిల్లాలో వెలుగుచూసింది. ఈనెల 20న ఈ ఘటన చోటుచేసుకుంది. 

వివ‌రాల్లోకి వెళితే.. 
మ‌లప్పురం జిల్లా(Malappuram district)లో ఓ 17 ఏళ్ల మైన‌ర్ బాలిక(Minor Girl) త‌న త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి నివ‌సిస్తోంది. త‌ల్లికి దృష్టిలోపం ఉండ‌గా.. తండ్రి సెక్యూరిటీ గార్డుగా ప‌నిచేస్తున్నాడు. త‌న ప‌క్కింటిలో ఉండే 21 ఏళ్ల యువ‌కుడితో ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌(Love)గా మారింది. దీంతో ఇద్ద‌రు శారీర‌కంగా ద‌గ్గ‌ర‌కావ‌డంతో బాలిక గ‌ర్భం(Pregnancy) దాల్చింది. దృష్టి లోపం కార‌ణంగా ఈ విష‌యాన్ని త‌ల్లి గుర్తించ‌లేదు. తండ్రి రాత్రి పూట విధులు నిర్వ‌ర్తిస్తూ ఎక్కువ‌గా ఇంటికి వ‌చ్చేవాడు కాదు. ఈ క్ర‌మంలో బాలిక‌కు నెల‌లు నిండాయి. ఈ నెల 20న బాలిక ఇంట్లోని గ‌దిలోకి వెళ్లి పండండి మ‌గ‌బిడ్డ‌(child birth)కు జ‌న్మ‌నిచ్చింది.

Also read:Ind vs Pak: India పై పాకిస్తాన్ గెలుపును సెలబ్రేట్ చేసుకున్న ఘటనల్లో ఐదుగురు అరెస్ట్

యూట్యూబ్‌(Youtube)లో చూసి బొడ్డు తాడును క‌త్తిరించుకుంది. ఈ విష‌యం రెండు రోజుల వ‌ర‌కు బాలిక త‌ల్లిదండ్రుల‌కు తెలియ‌లేదు. మూడో రోజు బాలుడు ఏడ‌వ‌డంతో విష‌యం బాలిక త‌ల్లికి తెలిసింది. బాలిక‌తో పాటు పుట్టిన పిల్లాడికి ఇన్పెక్ష‌న్ కావ‌డంతో బాలిక త‌ల్లి ఇద్ద‌రిని స‌మీపంలోని ప్ర‌భుత్వాసుప‌త్రికి తీసుకెళ్లింది. త‌ల్లీ బిడ్డ‌లు ఇద్ద‌రూ ప్ర‌స్తుతం కోలుకుంటున్నారు. మైన‌ర్ బాలిక గ‌ర్భం దాల్చ‌డం గురించి ఆస్ప‌త్రి సిబ్బంది మలప్పురం జిల్లా శిశు సంక్షేమ కమిటీ (Child Welfare Committee (CWC)కి స‌మాచారం అందించ‌గా.. వారు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

బాలిక గర్భం దాల్చడానికి కారణమైన ఆమె ప్రియుడిని పోలీసులు పోక్సో చట్ట(POCSO Act) నిబంధనల కింద బుధవారం అరెస్టు చేశారు.కొట్టకల్‌ ఠాణా పరిధిలో ఇంటర్మీడియట్‌ చదువుతున్న 17 ఏళ్ల బాలిక, 21 ఏళ్ల యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వారి పెళ్లికి అంగీకరించిన పెద్దలు, బాలికకు 18 ఏళ్లు నిండిన తర్వాత వివాహం చేయాలని నిశ్చయించారు. ఇంతలోనే గర్భవతి అయిన బాలిక విషయం తన తల్లిదండ్రులకు తెలియనివ్వలేదు. బిడ్డ ఏడుపు వినడంతో అసలు విషయం బయటకు వచ్చింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News