Pakistan captain babar Azam's reaction after defeating India: పాకిస్తాన్ జట్టు ఆదివారం చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. దుబాయ్ స్టేడియంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో భారత్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి గ్రూప్ 2లో అగ్రస్థానానికి చేరుకుంది. మహ్మద్ రిజ్వాన్ (79 నాటౌట్), బాబర్ ఆజామ్ (68 నాటౌట్) రాణించడంతో పాకిస్థాన్ జట్టు 17.5 ఓవర్లలోనే 152 పరుగులు చేసి భారత్ విధించిన లక్ష్యాన్ని ఛేధించింది. T20 ఇంటర్నేషనల్ క్రికెట్లో పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో గెలవడం ఇదే మొట్టమొదటిసారి. T20లో అవతలి ప్రత్యర్థిపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడం పాకిస్థాన్‌కు (Pakistan) ఇదే తొలిసారి కాగా.., భారత్ కూడా తొలిసారిగా ఇంత భారీ తేడాతో ఓడిపోయిన పేరు మూటగట్టుకుంది.
మ్యాచ్ తర్వాత పాకిస్థాన్ కేప్టేన్ బాబర్ ఆజమ్ (Pakistan captain Babar Azam) మాట్లాడుతూ.. "జట్టు మొత్తం సమిష్టిగా కృషి చేశాం. ఆట ఆరంభంలోనే వికెట్లు పడగొట్టడం ఎంతో ఉపయోగపడింది. షాహీన్ వికెట్స్ తీసిన తీరు మాకు చాలా ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. మా స్పిన్నర్లు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఒక ప్లాన్ ప్రకారం ఆడి ఫలితం పొందాము. ఓపెనర్లం సింపుల్‌గా ఆడుతూ మంచి భాగస్వామ్యాన్ని నిర్మించాం. చివరి వరకు బ్యాటింగ్ చేయాలనుకున్నాము. అదే అమలు చేశాం" అని తెలిపాడు.
Also read : India Vs Pakistan: గెలుపు తరువాత భావోద్వేగాయానికి గురైన బాబర్ అజామ్ తండ్రి.. వీడియో వైరల్
పాకిస్తాన్ విజయంలో ఓపెనర్లు లక్ష్యాన్ని ఛేదించి కీలక పాత్ర పోషిస్తే.. అసలు భారత్ ఎక్కువ స్కోర్ కొట్టకుండా చేసి ఆ జట్టు బౌలర్లు మరో ప్రధాన పాత్ర పోషించారు. షాహీన్ షా అఫ్రిది (Shaheen Shah Afridi) 31 పరుగులే ఇచ్చి 3 కీలకమైన వికెట్లు తీసి భారత్‌ని ఇబ్బందుల్లో పడేయడంలో విజయం సాధించాడు. 44 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసిన హసన్ అలీ, 22 పరుగులు ఇచ్చి 1 వికెట్ పడగొట్టిన షాదాబ్ ఖాన్.. ఇలా పాకిస్తాన్ బౌలర్లు (Pakistan bowlers) పాక్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
"ఇది ఆరంభం మాత్రమే. ఈ విజయంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇది అలా కంటిన్యూ అవుతుంది. మాపై ఒత్తిడి అంతగా లేదు. భారత్‌పై రికార్డు కొట్టాలనే ఆలోచన కూడా అస్సలు చేయలేదు'' అని బాబర్ ఆజామ్ (Babar Azam about India vs pakistan match) స్పష్టంచేశాడు.
Also read : Kohli Comments On Rohit Sharma: రోహిత్ శర్మను టీ20 ఫార్మాట్ నుంచి తొలగించాలా?
Also read : IND vs PAK: ఇండియాని ఓడించాక పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూంలో ఏం జరిగిందంటే...!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook