MS Dhoni talking with Pakistan players after the Match: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఒక వీడియో షేర్ చేసింది.. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ (India Vs Paksitan) అంటేనే భారీ అంచనాలు.. భావోద్వేగాలువుంటాయి.. మైదానంలో మాత్రం అందరు సమానమే.. గెలిచినా ప్రత్యర్థి జట్టును అభినందించే స్ఫూర్తి ఉండాలి.. అది టీమిండియాకు ఉంది అంటూ ఉన్న వీడియో ఇపుడు తెగ వైరల్ అవుతుంది.
టీ 20 ప్రపంచకప్ (T 20 World Cup 2021) లో భాగంగా ఆదివారం నాడు దుబాయి (Dubaoi) లో జరిగిన మ్యాచ్ లో.. చరిత్రని తిరగరాస్తూ.. పాకిస్తాన్ గెలుపొందిన (Pakistan Won by 10 Wickets) విషయం తెలిసిందే.. కానీ టీమిండియా ఓటమితో భారత్ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. కానీ కొన్ని వీడియోలు చూస్తే క్రీడాభిమానులు ఆకర్షిస్తున్నాయి.. అదేంటంటే.. మ్యాచ్ అనంతరం పాక్ ఆటగాళ్లు షోయబ్ మాలిక్, ఇమాద్ వసీం, బాబర్ అజమ్.. ధోనితో ముచ్చటించిన వీడియో తెగ వైరల్ అవుతుంది.
Also Read: G 20 Summit: జి 20 దేశాల సదస్సుకు హాజురుకానున్న ప్రధాని నరేంద్ర మోదీ
పాక్ కెప్టెన్ బాబర్ అజాం (Captain Babar Azam) మ్యాచ్ అనంతరం గ్రౌండ్ లోకి వచ్చిన దీనికి షేక్ హాండ్ ఇచ్చాడు.. మ్యాచ్ గెలిచిన తరువాత విరాట్ కోహ్లీ (Virat Kohli) కూడా నవ్వుతు పాకిస్తాన్ క్రికెటర్లు బాబర్ ఆజం మరియు మొహమ్మద్ రిజ్వాన్‌లకు (Rizwan) శుభాకాంక్షలు తెలిపిన తీరు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విరాట్-రిజ్వాన్‌ను కౌగిలించుకుంటూ విషెస్ తెలిపిన తీరు.. ఆ హుందాతనానికి నెటిజన్లు "చూడటానికి కన్నుల పండగ్గా ఉందని" "గెలుపు ఓటములు సాధారణం.. ఈ రోజు మనది కాదు.. రేపు మనది కాకుండా పోదు.." అంటూ కామెంట్లు చేస్తున్నారు.
And he virat wins hearts pic.twitter.com/gzHUrhXNcH
— Mahmood Alikhan (@yangoeza) October 24, 2021
Also Read: Amit Shah Tour: జమ్ముకశ్మీర్‌లో కొనసాగుతున్న కేంద్రమంత్రి అమిత్ షా పర్యటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook