Factory boiler explosion: పాకిస్తాన్ లాహోర్(Lahore)లోని ముల్తాన్ రోడ్డులో ఉన్న పరిశ్రమలో పేలుడు సంభవించింది. గురువారం ఒక పానీయాల కర్మాగారంలోని బాయిలర్ పేలి(boiler explosion) ఇద్దరు వ్యక్తులు మరణించారు.
బాయిలర్ పేలడంతో ఫ్యాక్టరీ భవనంలో మంటలు చెలరేగాయి. పేలుడు(Blast) తీవ్రత కర్మాగారంతోపాటు సమీప భవనాలపై ప్రభావం చూపించింది. భవనం అద్దాలు కూడా పగిలిపోయాయి. సమాచారం అందుకున్న ఏడు అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడితోపాటు ఫ్యాక్టరీ ఉద్యోగి మృతి చెందారు.
There was a blast in factory few minutes ago at Multan Road, Lahore. I hope everyone is safe.#blastinLahore pic.twitter.com/G5J6z6ZIZo
— PsychologistHira🌸 (@HiraJ04) October 21, 2021
Also read:Epsilon Variant Found in Pakistan: పాకిస్తాన్లో ప్రమాద ఘంటికలు.. బయటపడ్డ 7 కొత్త మ్యూటేషన్లు
కర్మాగారంలోని సెక్యూరిటీ గార్డుకు కూడా గాయాలయ్యాయి. అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ పేలుడుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా(Social media)లో వైరల్ గా మారాయి. బాయిలర్ పేలిన సమయంలో పెద్ద పెద్ద శబ్దాలు విన్పించాయి. దీంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు పోలీసులు.
ఇలాంటి ఘటనే మరో ఫ్యాక్టరీ(Factory)లో కూడా సంభవించింది. ఫైసలాబాద్(Faisalabad) పరిశ్రమలో బాయిలర్ పేలి...పైకప్పు కూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాకిస్థాన్‌లో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం డిసెంబర్ 22 న కరాచీ(Karachi)లో కూడా ఒక బాయిలర్ పేలింది. ఇక్కడ ఐస్ ఫ్యాక్టరీలో పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా, 15 మంది గాయపడ్డారు. ప్రస్తుతం జరిగిన ప్రమాదం చాలా తీవ్రమైనదిగా స్థానికులు చెబుతున్నారు. బాయిలర్ శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook