Samantha Defamation Case: నాగ చైతన్యతో విడాకుల (Naga Chaitanya) తరువాత సమంత (Samantha) ఏ పని చేసిన గత కొంత కాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తుంది. నాగ చైతన్య మరియు సమంత విడాకుల (Samantha Nagachaitanya Divorce) ప్రకటన చేసే సమయంలోనే... "మా ఇద్దరీ వ్యక్తిగత విషయాలగురించి గానీ, పర్సనల్ లైఫ్ విషయాల గురించి గానీ మీడియా, అభిమానులు మరియు సోషల మీడియాలో మాకు భంగం కలిగించేలా ఎలాంటి ప్రచారాలు చేయొద్దని కోరారు".
కానీ అంత మర్యాద పూర్వకంగా కోరిన తరువాత కూడా సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్లో ముఖ్యంగా సమంతను టార్గెట్ చేస్తూ చాలా రూమర్స్ వచ్చాయి. వీటిలో సమంతకు.. "తన స్టైలిష్ ప్రీతం (Preetham) కు మధ్య ఎదో ఉందని, ప్రీతమ్ వల్లే ఇద్దరికీ విడాకులు జరిగాయని మరియు సమంత పిల్లలు వద్దు అన్నందుకే నాగ చైతన్య విడాకులు ఇచ్చాడని"..ఇలా చాలా రకాల రూమర్స్ పుట్టుకొచ్చాయి.
Also Read: Mukku Avinash Wedding:పెళ్లి చేసుకున్న ముక్కు అవినాష్.. 'బ్లండర్ మిస్టేక్' అంటున్న రాంప్రసాద్!
వీటన్నింటికి చెక్ పెడుతూ సమంత సోషల్ మీడియాలో "ఇలా వ్యక్తిగత దాడి చేయటం సరికాదని, నన్ను వదిలేయండి.. ఇంకోసారి ఇలాంటి పోస్ట్ లు పెడితే కకఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని వార్నింగ్ కూడా ఇచ్చింది.
Actress #Samantha on Wednesday approached a court in Hyderabad seeking action against three YouTube channels.
She filed a defamation case against these YouTube channels and a lawyer as they spread malicious videos and publish fake news against her. pic.twitter.com/tUz4njHSyO
— dinesh akula (@dineshakula) October 20, 2021
అయినప్పటికీ కొంత మంది సమంత వ్యక్తిగత విషయాల గురించి పోస్ట్ చేయటంతో, తన పరువుకు భంగం కలిగిందని కొన్ని యూట్యూబ్ చానళ్లపై పరువు నష్టం దావా కేసు వేసింది. వీటిలో సుమన్ టీవీ (Suman TV), తెలుగు పాపులర్ టీవీ (Telugu Popular TV), టాప్ తెలుగు టీవీ (Top Telugu TV) లతో పాటు సీఎల్ వెంకట్రావుపై (CL Venkat Rao) పిటిషన్ దాఖలు చేశారు సమంత.
Also Read: AP Bundh:ఎక్కడికక్కడ టీడీపీ నేతల అరెస్ట్- పట్టాభి క్షమాపణకు వైసీపీ డిమాండ్
సోషల్ మీడియాలో తనపై పుకార్లు పుట్టిస్తున్నారని, కించపరిచేలా పోస్ట్ లు పెడుతున్నారని కూకట్‌పల్లి కోర్టులో (Kukat Pally Court) పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఎలాంటి దుష్ప్రచారాలు జరగకుండా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరింది. ఈ రోజు సాయంత్రం కోర్టులో వాదనలు వినిపించనుండగా, తీర్పు కూడా ఈ రోజు వెలువడే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook