Bala krishna: 'లైగర్‌' సెట్‌లో లయన్.. ఫోటోలు వైరల్‌

Liger: రౌడీ హీరో విజయ్ తాజా చిత్రం లైగర్. ఈ సినిమా చిత్రీకరణ గోవాలో శరవేగంగా జరుగుతుంది. షూటింగ్ జరుగుతున్న సమయంలో అనుకోకుండా ఓ ముఖ్య అతిథి సెట్‌లోకి అడుగు పెట్టి అందరిని సర్‌ప్రైజ్ చేశారు. ఆయన ఎవరంటే నటసింహ నందమూరి బాలకృష్ణ. వివరాల్లోకి వెళితే..

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 22, 2021, 06:43 PM IST
  • లైగర్ సెట్లో బాలకృష్ణ ప్రత్యక్షం
  • షాక్ తిన్న లైగర్ టీమ్
  • విజయ్ లుక్ ను మెచ్చుకున్న నటసింహం
Bala krishna: 'లైగర్‌' సెట్‌లో లయన్.. ఫోటోలు వైరల్‌

Balakrishna Surprises Team Liger in Goa: విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్‌(Puri Jagannath) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ  'లైగర్‌'(Liger).  బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే(Ananya pandey) ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం గోవా(Goa)లో జరుగుతుంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ(Nandamuri Balakrishna) లైగర్‌ సెట్‌లో సడెన్‌గా ప్రత్యక్షం అయ్యారు. బాలయ్య సర్‌ప్రైజ్‌ విజిట్‌తో మూవీ టీం ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత అందరూ సరదాగా మాట్లాడి ఫోటోలకు ఫోజులిచ్చారు.

గోవాకు దగ్గర్లో అఖండ సినిమా షూటింగ్ జరుగుతుండటంతో లైగర్ సెట్‌లోకి వచ్చారు నందమూరి బాలకృష్ణ. లైగర్ సెట్‌ను చూసి చిత్రయూనిట్‌ను అభినందించారు. సెట్ గ్రాండ్ నెస్‌ను చూసి, సినిమాను ఇంత భారీ ఎత్తున నిర్మిస్తుండటంతో మేకర్స్‌ మీద బాలకృష్ణ(Nandamuri Balakrishna) ప్రశంసలు కురిపించారు. ఇక లైగర్ చిత్రంలో విజయ్ దేవరకొండ(Vijaya Deverakonda) లుక్‌ను చూసి బాలకృష్ణ ఆశ్చర్యపోయారు. లైగర్ భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటూ టీంకు కంగ్రాట్స్ తెలిపారు బాలయ్య. 

Also Read:Rana Naidu : రానా కల నేరవేరిందట.. బాబాయ్‌తో కలిసి నటించనున్న అబ్బాయి

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియా(Social Media)లో వైరల్‌ అవుతున్నాయి. స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న  లైగర్  సినిమాను కరణ్‌ జోహార్, పూరి జగన్నాథ్, చార్మి, అపూర్వా మెహతా నిర్మిస్తున్నారు. మరోవైపు బాలయ్య ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో అఖండ సినిమాను పూర్తి చేశారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News