Russian university shooting: రష్యా యూనివర్శిటీ కాల్పుల్లో 8 మంది మృతి, ఇంకొందరికి గాయాలు

Russian university shooting death toll, latest updates: పెర్మ్ స్టేట్ యూనివర్సిటీ ప్రెస్ వెల్లడించిన వివరాల ప్రకారం గుర్తు తెలియని దుండగుడు నాన్-లెధల్ గన్ ఉపయోగించి ఈ కాల్పులకు పాల్పడినట్టు తెలుస్తోంది. దుండగుడి బారి నుంచి ప్రాణాలు రక్షించుకోవడానికి యూనివర్శిటీ స్టూడెంట్స్, సిబ్బంది తమ తమ గదుల్లోనే తమను తాము బంధీలు చేసుకున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 20, 2021, 04:48 PM IST
Russian university shooting: రష్యా యూనివర్శిటీ కాల్పుల్లో 8 మంది మృతి, ఇంకొందరికి గాయాలు

Russian university shooting death toll, latest updates: మాస్కో: రష్యాలోని పెర్మ్ సిటీలో ఉన్న యూనివర్శిటీలో సోమవారం చోటుచేసుకున్న కాల్పుల్లో మృతుల సంఖ్య 8 కి చేరిందని అక్కడి దర్యాప్తు సంస్థ ఇన్వెస్టిగేటివ్ కమిటీ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ వెల్లడించింది. పెర్మ్ స్టేట్ యూనివర్సిటీ ప్రెస్ వెల్లడించిన వివరాల ప్రకారం గుర్తు తెలియని దుండగుడు నాన్-లెధల్ గన్ ఉపయోగించి ఈ కాల్పులకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో గాయపడిన వారి సంఖ్యపై ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. దుండగుడి బారి నుంచి ప్రాణాలు రక్షించుకోవడానికి యూనివర్శిటీ స్టూడెంట్స్, సిబ్బంది తమ తమ గదుల్లోనే తమను తాము బంధీలు చేసుకున్నారు. యూనివర్శిటీ క్యాంపస్ వదిలి సురక్షితంగా వెళ్లగలిగే వాళ్లు వెళ్లిపోవచ్చని యూనివర్శిటీ (Perm state University) ప్రకటించింది.

రష్యా యూనివర్శిటీలో కాల్పుల ఘటనపై (shooting at Russian university) రష్యన్ ఇంటీరియర్ మినిస్ట్రీ స్పందిస్తూ.. కాల్పులకు పాల్పడిన దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొంది. 

Also read : SpaceX Mission Success: అంతరిక్షంలో మొట్టమొదటి ప్రైవేట్ పర్యాటక యాత్ర విజయవంతం

ఇదే ఘటనపై టాస్ న్యూస్ ఏజెన్సీ స్పందిస్తూ.. దుండగుడు (Gunman) కాల్పులకు పాల్పడే సమయంలో కొంత మంది తమ ప్రాణాలు రక్షించుకునేందుకు కిటికీల్లోంచి కిందకు దూకారని అక్కడి దర్యాప్తు సంస్థలోని అధికారి ఒకరు చెప్పినట్టుగా పేర్కొంది. అయితే ఈ విషయంలో ఇంకా ఎలాంటి స్పష్టత లభించలేదు. రష్యాలో కాల్పుల ఘటనకు (Russian university shooting) సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Also read : Viral Photo: ఆన్‌లైన్ క్లాస్‌లో అందరిని ఫూల్ చేసిన అమ్మాయి.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News