AP Zilla Parishad Counting: ఆంధ్రప్రదేశ్ జిల్లా పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా రేపు కౌంటింగ్ ప్రారంభం కానుంది. కోవిడ్ నిబంధలు, భారీ భద్రత మధ్య ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.
ఎట్టకేలకు రాష్ట్రంలో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల(Zilla Parishad Elections)ఫలితాలు మరి కొద్దిగంటల్లో వెలువడనున్నాయి. ఏప్రిల్ 8వ తేదీన పోలింగ్ జరిగినా హైకోర్టు ఉత్తర్వుల నేపధ్యంలో కౌంటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా ఎన్నికల కౌంటింగ్‌కు ఏపీ హైకోర్టు(Ap High Court) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 19వ తేదీన అంటే రేపు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు చేసిన 206 కేంద్రాల్లో కౌంటింగ్ జరగనుంది. దాదాపు ఐదున్నర నెలలుగా బ్యాలెట్ బాక్సుల్ని భద్రపరిచారు. బ్యాలెట్ లెక్కింపు కావడంతో మొత్తం ఫలితాలు వచ్చేసరికి రాత్రి కావచ్చు. ఒక్కొక్క కేంద్రంలో మండలాల వారీగా కౌంటింగ్ జరుగుతుంది.ఇప్పటికే అభ్యర్ధులందరికీ కౌంటింగ్ కేంద్రాల(Zptc-Mptc Counting)వివరాలు అందించారు. కౌంటింగ్ రాత్రి వరకూ కొనసాగనున్నందున జనరేటర్లు సిద్ధం చేసుకోవాలని అధికారులు ఆదేశించారు. స్ట్రాంగ్‌రూమ్ నుంచి కౌంటింగ్ హాల్లోకి బ్యాలెట్ బాక్సుల్ని తరలించే సమయంలో సీసీటీవీ కవరేజ్ ఉంటుంది.
ఎంపీటీసీ స్థానాల లెక్కింపు ఒకే టేబుల్‌పై ఒకేసారి జరగనుంది. ఓట్ల లెక్కింపు కోసం 42 వేల 360 మంది సిబ్బందిని వినియోగించారు.11 వేల 227 మంది కౌంటింగ్ సూపర్ వైజర్లు, 31 వేల 133 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు. మరో 89 మందిని అడిషనల్ అబ్జర్వర్లుగా నియమించారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తరువాత బ్యాలెట్ బాక్సు(Ballot Box)లెక్కింపు జరుగుతుంది. బ్యాలెట్ పేపర్ రంగు ఆధారంగా రెండు రకాల ఓట్లను వర్గీకరిస్తారు.
ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. కోవిడ్ నిబంధనల్ని(Covid19 Protocol)కచ్చితంగా అమలు చేయనున్నారు. కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి కౌంటింగ్ కేంద్రానికి వంద మీటర్ల పరిధిలో సెక్షన్ 144 అమల్లో ఉంటుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 24 గంటలు కంట్రోల్ రూమ్ ఏర్పాటు ఉంటుంది.
Also read: Chandrababus residence: చంద్రబాబు నివాసం వద్ద ఆందోళన, వైసీపీ, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం, ఉద్రిక్తంగా మారిన పరిస్థితులు, జోగి రమేశ్ కారు అద్దాలు ధ్వంసం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook