Bandla Ganesh comments Party politics on MAA Elections : మా ఎన్నికల ప్రచారం పేరుతో.. మా (MAA) ఎన్నికల ఓట్ల కోసం కళాకారులందర్నీ ఒక దగ్గరికీ చేర్చొద్దు అని నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ (Bandla Ganesh) అన్నారు. కళాకారుల జీవితాలతో చెలగాటాలాడొద్దని సూచించారు. మా ఎన్నికల్లో పోటీ చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ‘మా’ సభ్యులకు ఫోన్ చేసి వివరించండి కానీ విందులు, పార్టీల పేరుతో వారిని ఒకే చోటకు చేర్చకండి అని కోరారు. ఈ మేరకు గణేశ్ సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేశారు. ఎన్నికల వేళ ‘మా’లో విందు రాజకీయాలు (politics) సాగుతుండడంపై ఆయన స్పందించారు.
It’s my humble request 🙏 pic.twitter.com/fFaXAiEK4g
— BANDLA GANESH. (@ganeshbandla) September 12, 2021
ఓటు కావాలనుకుంటే ఫోన్ చేయండి
దయజేసి ‘మా’ కళాకారులందర్నీ విందులు, సన్మానాలు, రకరకాల పేర్లతో ఒకదగ్గరికి చేర్చకండి అన్నారు గణేశ్. గత రెండేళ్ల నుంచి ప్రతి ఒక్కరూ కరోనా (Corona) భయంతోనే బతుకుతున్నారన్నారు. నాలాంటి వాళ్లు ఎంతో మంది చావుదాకా వెళ్లొచ్చారని గుర్తు చేశారు. మీకు ఓటు కావాలనుకుంటే వారు.. కళాకారులకు ఫోన్ చేసి మీరు చేయాలనుకున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వాళ్లకు చెప్పండి అని సూచించారు. వాళ్ల జీవితాలతో చెలగాటాలాడొద్దు.. ఇదే నా విన్నపం అంటూ బండ్ల గణేశ్ ఎమోషనల్ల స్టేట్‌మెంట్ ఇచ్చారు.
కళాకారులందరికీ విందు
కాగా ఈ సారి ‘మా’ ఎన్నికల్లో (MAA Elections) జనరల్ సెక్రటరీ పదవి కోసం పోటీ పడనున్నారు. ఈ సారి ‘మా’ ఎన్నికలు హాట్ టాపిక్‌గా మారాయి. ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు పోటీలోకి దిగుతున్నారు. ఇప్పటికే తన ప్యానల్‌ని ప్రకటించిన ప్రకాశ్‌రాజ్ గెలుపు కోసం అన్ని రకాలుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఆదివారం కళాకారులందరికీ విందు (Party) ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో బండ్ల గణేశ్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Also Read : Sai Dharam Tej Health Condition : నిలకడగా సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం, కాలర్ బోన్ ఆపరేషన్ చేసే అవకాశం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook