COVID booster shot: కోవిడ్ బూస్టర్ షాట్‌ వ్యాక్సిన్ అంటే ఏంటి? ఎవరు తీసుకోవాలి ?

Coronavirus vaccination COVID booster shot vaccine : కోవిడ్ మళ్లీ మళ్లీ సోకుతూనే ఉంది. రోగనిరోధక శక్తి (immunity) చాలా తక్కువగా ఉన్నవారు, ఇతర వ్యాధులతో ఇబ్బందిపడేవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. వీరికి కోవిడ్‌ బూస్టర్ డోస్ (COVID booster dose) అవసరం చాలా ఉంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 7, 2021, 05:40 PM IST
  • కోవిడ్‌ బూస్టర్ షాట్‌కు పెరిగిన డిమాండ్
  • రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి అవసరం
  • వివిధ రోగాలతో బాధపడేవారికి బూస్టర్ షాట్‌
  • తప్పనిసరి అంటున్న నిపుణులు
COVID booster shot: కోవిడ్ బూస్టర్ షాట్‌ వ్యాక్సిన్ అంటే ఏంటి? ఎవరు తీసుకోవాలి ?

Coronavirus vaccination COVID booster shot vaccine : ప్రస్తుతం మళ్లీ అంతటా కోవిడ్‌ గురించే చర్చ జరుగుతోంది. థర్డ్‌ వేవ్‌ ముప్పుతో అందరిలో మళ్లీ కరోనావైరస్ ఆందోళన మొదలైంది. కరోనావైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు అందరూ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. అయినా కూడా కొందరు కోవిడ్‌ వైరస్‌  (COVID infection) బారిన పడుతూనే ఉన్నారు. కరోనావైరస్‌ మళ్లీ మళ్లీ సోకుతూనే ఉంది. రోగనిరోధక శక్తి (immunity) చాలా తక్కువగా ఉన్నవారు, ఇతర వ్యాధులతో ఇబ్బందిపడేవారిలోనే ఇది ఎక్కువగా కనిపిస్తోంది. వీరికి కోవిడ్‌ బూస్టర్ డోస్ (COVID booster dose) అవసరం చాలా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తుందన్న హెచ్చరికలతో పాటు రోజుకొక రకమైన వేరియంట్స్ పుట్టుకొస్తున్న నేపథ్యంలో ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో బూస్టర్ షాట్‌కు ఇప్పుడు బాగా డిమాండ్ పెరిగింది. మనదేశంలోనూ భారత్‌ బయోటెక్ (Bharat Biotech) ప్రస్తుతం వ్యాక్సిన్ బూస్టర్‌ను అభివృద్ధి చేసే పనిలో ఉంది. బూస్టర్ వ్యాక్సిన్ షాట్ల ట్రయల్స్ ఇప్పటికే జరుగుతున్నాయి. ఇజ్రాయెల్, అమెరికాలు ఇప్పటికే పెద్దవారికి బూస్టర్ షాట్‌లను అందించడం ప్రారంభించాయి.

చాలా దేశాలు 'బూస్టర్' లేదా కోవిడ్‌ థర్డ్ డోస్‌  (covid third dose) తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. డెల్టా వేరియంట్ (delta variant) ఇప్పటికే  ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.  ఈ క్రమంలో బూస్టర్ షాట్ అసవరం ఎంతైనా ఉంది. దీనివల్ల కోవిడ్‌ కొత్త వేరియంట్ల బారి నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. బూస్టర్ షాట్ రోగనిరోధక వ్యవస్థను పెంపొందిస్తుంది.  

కోవిడ్ బూస్టర్ షాట్ అవసరమా?

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వైరస్‌పై పోరాడేందుకు తీసుకున్న కోవిడ్ వ్యాక్సిన్‌ల ప్రభావం కొంత కాలానికి తగ్గడం సహజం. ఎప్పటికప్పుడు పుట్టుకొస్తున్న కొత్త వేరియంట్ల కారణంగా.. కోవిడ్ వ్యాక్సిన్స్ పూర్తిగా తీసుకున్న వారు కూడా మళ్లీ కరోనా బారిన పడే ప్రమాదం ఉంటుంది. అలా అని మనం తీసుకున్న వ్యాక్సిన్ అంత ప్రభావవంతంగా పని చేయదని కాదు. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్,  ప్రివెన్షన్ (Center for Disease Control and Prevention) ప్రకారం, "విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న డెల్టా వేరియంట్‌కు వ్యతిరేకంగా ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్స్ బాగా పని చేస్తున్నాయి. తీవ్రమైన అనారోగ్యం బారిన పడకుండా, ఆసుపత్రిలో చేరకుండా,  ప్రాణాంతకం కాకుండా ఉండేందుకు కోవిడ్ (COVID)టీకాలు బాగా పనిచేస్తున్నాయి. డెల్టా వేరియంట్‌ ( Delta variant) విస్తరిస్తున్న క్రమంలో ఇతర వ్యాధులతో బాధపడే వారిలో వ్యాధినిరోధకత శక్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉండదు.

Also Read : కరోనా వ్యాక్సిన్ అసలైనదా, నకిలీదా అనేది ఎలా గుర్తించడం

అందుకే  రోగనిరోధక శక్తి చాలా తక్కువ ఉన్నవారికి కోవిడ్‌ బూస్టర్ డోస్ అవసరం.

Who will require a booster shot ? ఎవరు తీసుకోవాలి

సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం వీరు బూస్టర్ షాట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. 

- కణితులు, బ్లడ్ క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్న వ్యక్తులు
- హెచ్ఐవీ వ్యాధి అడ్వాన్స్ స్టేజీలో ఉన్న వాళ్లు లేదా ఇంకా చికిత్స తీసుకోనివాళ్లు.
- అవయవ మార్పిడి చేయించుకున్న వారు
-  రోగనిరోధక శక్తిని తగ్గించే మందులను తీసుకుంటున్న వ్యక్తులు, రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉండేవారు

ఇలాంటి వారంతా బూస్టర్ షాట్ ఎంత త్వరగా తీసుకుంటే అంత మేలు. దీనివల్ల కొత్తగా అభివృద్ధి చెందుతున్న కోవిడ్‌ (Covid) వేరియంట్‌ల ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు. 

Also Read : Bigg Boss Telugu 5: బిగ్ బాస్ తెలుగు 5 నామినేషన్స్‌.. Vishwa vs Jessi, సన్ని vs సరయు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News