AP Corona Update: ఏపీలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

AP Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి కేసులు ఇంకా స్థిరంగానే కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో కర్ఫ్యూ ఆంక్షల్ని సడలించడంతో కరోనా వైరస్ సంక్రమణ క్రమంగా పెరుగుతున్న పరిస్థితి కన్పిస్తోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 4, 2021, 07:52 PM IST
  • ఏపీలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా వైరస్ సంక్రమణ
  • కర్ఫ్యూ ఆంక్షల సడలింపు కారణంగా తగ్గని కరోనా వైరస్ కేసులు
  • గత 24 గంటల్లో 15 వందల కొత్త కేసులు నమోదు
AP Corona Update: ఏపీలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

AP Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి కేసులు ఇంకా స్థిరంగానే కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో కర్ఫ్యూ ఆంక్షల్ని సడలించడంతో కరోనా వైరస్ సంక్రమణ క్రమంగా పెరుగుతున్న పరిస్థితి కన్పిస్తోంది. 

కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) కారణంగా ఏపీలో నెలకొన్న విపత్కర పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నాయి. మొన్నటి వరకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా..ఇప్పుడు మళ్లీ స్వల్పంగా పెరుగుతూ స్థిరంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో కర్ఫ్యూ ఆంక్షల్ని ఎక్కడికక్కడ సడలిస్తూ..కేవలం రాత్రిపూట కర్ఫ్యూ మాత్రమే అమలు చేస్తుండటంతో కరోనా సంక్రమణ ఛైన్ మరోసారి పటిష్టమవుతున్నట్టు అర్ధమౌతోంది. ఇదే పరిస్థితి దేశవ్యాప్తంగా నెలకొంది. నెమ్మదిగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న పరిస్థితి. ఏపీలో గత 24 గంటల్లో 63 వేల 717 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 1502 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 1525 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. మొన్నటి వరకూ రోజువారీ కేసులు వేయి వరకూ ఉండేవి. ఇప్పుడు కాస్త పెరుగుదల కన్పిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల 68 లక్షల 73 వేల 491 కరోనా నిర్ధారణ పరీక్షలు(Covid19 Tests) నిర్వహించారు. అదే సమయంలో గత 24 గంటల్లో 16 మంది కరోనా వైరస్ కారణంగా మరణించారు. రాష్ట్రంలో 19 లక్షల 90 వేల 916 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14 వేల 843 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

Also read: AP HRC Office: మూడు రాజధానుల దిశగా ఏపీ ప్రభుత్వం, కర్నూలులో తొలి కార్యాలయం ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News