Richter Scale: దక్షిణ భారతదేశంలో పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన భూకంపం కారణంగా భూ ప్రకంపనలు విస్తరించాయి. వివరాలిలా ఉన్నాయి.
బంగాళాఖాతంలో(Bay of Bengal) ఇవాళ మద్యాహ్నం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.1గా నమోదైంది. ఫలితంగా చెన్నైలో(Tremors in chennai) భూమి స్వల్పంగా కంపించింది. భూకంప కేంద్రం చెన్నై నగరానికి తూర్పు ఈశాన్య దిశలో 320 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు గుర్తించారు. మద్యాహ్నం సరిగ్గా 12 గంటల 23 నిమిషాలకు భూమి కంపించిందని ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిస్మాలజీ వెల్లడించింది. ఏపీపై భూకంపం ఎటువంటి ప్రభావం చూపలేదని రాష్ట్ర విపత్తుల శాఖ తెలిపింది. ఏపీలోని కాకినాడకు 296 కిలోమీటర్ల దూరంలో పదికిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు సిస్మాలజీ నిపుణులు గుర్తించారు. చెన్నైలో పలు ప్రాంతాల్లో స్వల్పంగానే భూమి కంపించడంతో ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోలేదు.
Also read: Maharashtra: ఉద్ధవ్ థాక్రేపై అనుచిత వ్యాఖ్యలు, కేంద్రమంత్రి అరెస్టు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook