Heavy Rains Alert: ఆంధ్రప్రదేశ్‌కు అతి భారీ వర్షాలు పొంచి ఉన్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నందున రానున్న 48 గంటల్లో వర్షాలు తప్పవని ఐఎండీ హెచ్చరించింది.
ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy Rains)కురవనున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తాలో తేలిక నుంచి మోస్తరు వర్షాలు, ఉత్తర కోస్తాలో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని ఐఎండీ వివరించింది. సముద్రతీరం వెంబడి 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని..మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఐఎండీ(IMD)హెచ్చరించింది. అటు రాయలసీమ ప్రాంతంలో కూడా తేలిక నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి.
ఇప్పటికే గత 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో సగటు 13 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా..అత్యధికంగా జంగారెడ్డిగూడెంలో 70 మిల్లీమీటర్ల వర్షం పడింది. తూర్పు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. గుంటూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.
Also read: Ys Jagan Tour: నాడు-నేడు రెండవ విడత పనుల్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook