AP Corona Update: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి పంజా విసిరేందుకు సిద్ధమవుతుంటే..ఏపీలో మాత్రం కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 వేల దిగువకు చేరాయి.
కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave)సృష్టించిన విపత్కర పరిస్థితుల్నించి ఆంధ్రప్రదేశ్ కోలుకుంటోంది. దేశంలోని కేరళ, మహారాష్ట్రలలో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నా..ఏపీలో మాత్రం తగ్గుముఖం పడుతున్నాయి. మరోవైపు కరోనా కేసులు తగ్గడంతో నైట్ కర్ఫ్యూ(Night Curfew)ఒక్కటే కొనసాగుతోంది. కరోనా థర్డ్‌వేవ్ ముప్పు నేపధ్యంలో కోవిడ్ గైడ్‌లైన్స్‌ను కఠినంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం.
మరోవైపు గత 24 గంటల్లో ఏపీలో 59 వేల 641 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..1546 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 19 లక్షల 70 వేలకు చేరుకుంది. ఇక 15 మంది గత 24 గంటల వ్యవధిలో కరోనా కారణంగా మరణించారు.రాష్ట్రంలో ఇప్పటి వరకూ 13 వేల 410 మంది కోవిడ్ కారణంగా మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 20 వేల 582 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.గత 24 గంటల్లో 1968 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.రాష్ట్రంలో ఇప్పటి వరకూ 19 లక్షల 36 వేలమంది కోలుకున్నారు. ఇప్పటి వరకూ ఏపీలో 2 కోట్ల 47 లక్షల 8 వేల 540 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు(Covid19 Tests) నిర్వహించారు. గత 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 416 కరోనా పాజిటివ్ కేసులు, చిత్తూరులో 229, ప్రకాశంలో 201, నెల్లూరులో 151 కేసులు మోదయ్యాయి.
Also read: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
ఆంధ్రప్రదేశ్‌లో తగ్గుతున్న కరోనా పాజిటివ్ కేసులు, కొనసాగుతున్న నైట్ కర్ఫ్యూ