Karnataka New CM: కర్ణాటకలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామాతో కొత్త ముఖ్యమంత్రి ఎవరనే చర్చ సాగుతోంది. ప్రస్తుత హోంమంత్రికే ముఖ్యమంత్రి పీఠం వరించవచ్చనే వార్తలు విన్పిస్తున్నాయి.
కర్ణాటక బీజేపీ(BJP)లో పరిణామాలు ఆసక్తిగా మారుతున్నాయి. ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప రాజీనామా చేయడంతో కొత్త ముఖ్యమంత్రి ఎన్నిక ఆసక్తి రేపుతోంది. దక్షిణాదిన తొలిసారిగా బీజేపీకు అధికారం సాధించిపెట్టిన యడ్యూరప్పకు సైతం పదవి నుంచి దిగిపోక తప్పలేదు. యడ్యూరప్ప (Yediyurappa)వ్యతిరేక వర్గం ఒత్తిళ్ల నేపధ్యంలో బీజేపీ అధిష్టానం రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించింది. ముఖ్యమంత్రిగా రెండేళ్లు పదవీకాలం పూర్తి చేసుకున్న రోజే రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి ఎన్నిక ప్రక్రియ కొనసాగుతోంది.
కొత్త ముఖ్యమంత్రి(Karnataka new cm) రేసులో హోంమంత్రి బసవరాజ్ బొమ్మై(Basavaraj bommai), అరవింద్ బెల్లాద్, బసన్న గౌడ పాటిల్, సీటీ రవి తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే ప్రస్తుత హోంమంత్రి, లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన బసవరాజ్ బొమ్మై వైపు అధిష్టానం మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మై కుమారుడే బసవరాజ్ బొమ్మై.
Also read: Karnataka: రాజీనామాకు ముందు డీఏ భారీగా పెంచిన యడ్యూరప్ప
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook