Covid19 cases in India: ఇండియాలో నిన్నటితో పోల్చితే కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. గత రోజు కంటే 7 వేలకు పైగా పాజిటివ్ కేసులు అధికంగా నమోదయ్యాయి. మరోవైపు కోవిడ్-19 మరణాలు భారీగా తగ్గడం స్వల్ప ఊరట కలిగిస్తోంది. జులై 13వ తేదీ వరకు దేశంలో 38,76,97,935 (38 కోట్ల 76 లక్షల 97 వేల 935 డోసుల కోవిడ్19 టీకాలు ఇచ్చారు. నిన్న ఒక్కరోజులో 37 లక్షల 14 వేల 441 మంది కోవిడ్19 టీకాలు తీసుకున్నారని హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.
భారత్‌లో జులై 14 ఉదయం 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 38,792 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. నిన్న 118 రోజుల కనిష్టానికి కరోనా కేసులు దిగిరాగా, నేడు ఏడు వేలకు పైగా అదనంగా కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,09,46,074 (3 కోట్ల 9 లక్షల 46 వేల 74)కు చేరుకుంది. నిన్నటితో పోల్చితే కరోనా మరణాలు భారీగా తగ్గాయి. కోవిడ్19 (COVID-19) మహమ్మారితో పోరాడుతూ దేశంలో మరో 624 మంది మరణించారు. ఇండియాలో ఇప్పటివరకూ 4,11,408 (4 లక్షల 11 వేల 408) మంది ఈ వైరస్ బారిన పడి చనిపోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Also Read; AP Corona Update: ఏపీలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు
India reports 38,792 new #COVID19 cases, 41,000 recoveries, and 624 deaths in the last 24 hours, as per Health Ministry
Total cases: 3,09,46,074
Total recoveries: 3,01,04,720
Active cases: 4,29,946
Death toll: 4,11,408Total vaccinated: 38,76,97,935 (37,14,441 in last 24 hrs) pic.twitter.com/wroOjdz1hc
— ANI (@ANI) July 14, 2021
గడిచిన 24 గంటల్లో 41,000 మంది కోవిడ్19 మహమ్మారి బారి నుంచి కోలుకున్నాయి దేశంలో ఇప్పటివరకూ కరోనా వైరస్ (CoronaVirus) జయించిన వారి సంఖ్య 3,01,04,720 (3 కోట్ల 1 లక్షా 4 వేల 720)కు చేరుకుంది. దేశంలో యాక్టివ్ కరోనా కేసులు 4 లక్షలకు దిగొచ్చాయి. ప్రస్తుతం 4 లక్షల 11 వేల 408 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు 19,15,501 (19 లక్షల 15 వేల 501) శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటివరకూ భారత్‌లో 43,59,73,639 (43 కోట్ల 59 లక్షల 73 వేల 639) శాంపిల్స్‌కు కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ ఓ ప్రకటనలో తెలిపింది.
Also Read: Covaxin Emergency Use: కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి WHO త్వరలోనే అనుమతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
India Covid19 Cases: ఇండియాలో మళ్లీ పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు, అదొక్కటే ఊరట