AP High Court Jobs: నిరుద్యోగులకు శుభవార్త. ఏపీ హైకోర్టులో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ అయింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల్ని భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ఎలా చేయాలి, వేతనమెంత వంటి వివరాలివీ.
ఏపీ హైకోర్టు(AP High Court)లో ఖాళీల్ని భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ బేసిస్‌లో న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లకు సహాయకులుగా కోర్టు మార్షల్స్, పర్సనల్ సెక్రటరీ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. మొత్తం 25 పోస్టులు ఉండగా..ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఏపీ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్వహించిన ఇంగ్లీష్ షార్ట్‌హ్యాండ్ అర్హత కలిగి ఉండాలి. ఇంగ్లీషులో నిమిషానికి 150 పదాల షార్ట్‌హ్యాండ్ వేగంతో అర్హత ఉండాలి. కంప్యూటర్ నైపుణ్యం కలిగిన అభ్యర్ధులకు ప్రాధాన్యత ఉంటుంది. జూలై 1, 2021 నాటికి 18-42 ఏళ్ల మధ్యలో వయస్సు కలిగి ఉండాలి. వేతనం నెలకు 37 వేల 100 రూపాయలుగా ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు https://hc.ap.nic.in సంప్రదించాలి. దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ జూలై 21వ తేదీ.
Also read: Schools Reopen: ఆగస్టు 15 తరువాత ఏపీలో స్కూల్స్ ప్రారంభానికి నిర్ణయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook