AP Police Jobs: ఆంధ్రప్రదేశ్‌లో పెద్దఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలు కొలువు దీరనున్నాయి. ముఖ్యంగా పోలీసు శాఖలో ప్రతి యేటా ఇక నుంచి భారీ ఎత్తున పోలీసు ఉద్యోగాల్ని భర్తీ చేయనున్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్.
ఏపీ పోలీసు శాఖలో ఇక నుంచి ప్రతియేటా పెద్దఎత్తున రిక్రూట్మెంట్(Ap Police Recruitment) జరగనుంది. 2022 జాబ్ క్యాలెండర్ నుంచి ప్రతి యేటా 6 వేల 5 వందల పోలీసు ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. కొత్త నియామకాల విషయంలో యువతలో ఉన్న అపోహల్ని, సందేహాల్ని నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. మహిళల భద్రతకై గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమించిన 15 వేలమంది మహిళా సురక్షా కార్యదర్శులకు మహిళా పోలీసు హోదా కల్పించిన విషయాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్(Goutam Sawang) గుర్తు చేశారు. ఈ మహిళలందరికీ కానిస్టేబుల్ తరహా శిక్షణ త్వరలో అందిస్తామన్నారు.
ప్రస్తుతం ఏపీ పోలీసు శిక్షణా కేంద్రంలో(Ap Police Training Centre) 6 వేల 5 వందలమందికి మాత్రం ఒకేసారి శిక్షణ ఇచ్చే అవకాశమున్నందున మహిళా పోలీసుల శిక్షణ ముగిసిన తరువాత ఇతర రెగ్యులర్ పోలీసు నియామక ప్రక్రియపై దృష్టి పెడతామన్నారు. గత ఏడాదిలో 3 వేల 57మంది కానిస్టేబుల్ పోస్టుల్ని భర్తీ చేశామన్నారు. మరో 11 వేల పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు. గత రెండేళ్లలో ప్రభుత్వం 6 లక్షల 5 వేల 949 పోస్టుల్ని భర్తీ చేసిందన్నారు.ఇందులో 1 లక్షా 84 వేల 262 రెగ్యులర్, 19 వేల701 పోస్టులు కాంట్రాక్ట్ బేసిస్‌లో ఉన్నాయన్నారు. ఇక 3 లక్షల 99 వేల 791 ఉద్యోగాల్ని ఔట్ సోర్సింగ్ ద్వారా, 2 వేల 193 పోస్టుల్ని డీఎస్సీ ద్వారా భర్తీ చేశామన్నారు. ఇక నుంచి ప్రతి యేటా 6 వేల 5 వందల ఉద్యోగాల భర్తీ జరుగుతుందన్నారు.
Also read: AP Government: వీఆర్వోలకు ఇక నేరుగా పదోన్నతి, కొత్తగా విధి విధానాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook