Abhijit Mukherjee Joins TMC: పశ్చిమ బెంగాల్ రాజకీయాలలో కీలక పరిణామం, టీఎంసీలో చేరిన అభిజిత్ ముఖర్జీ

Abhijit Mukherjee joins TMC: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కుమారుడు అభిజిత్‌ ముఖర్జీ కాంగ్రెస్‌ పార్టీని వీడారు. ఊహాగానాలను నిజంచేస్తూ తృణమూల్‌ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. గత కొన్ని రోజులుగా ఆయన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మద్దతు తెలుపుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 5, 2021, 05:43 PM IST
  • మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనయుడు కీలక నిర్ణయం
  • టీఎంసీలో చేరిన ప్రణబ్ ముఖర్జీ తనయుడు అభిజిత్ ముఖర్జీ
  • సైనికుడిగా పార్టీ కోసం పనిచేస్తానంటూ ప్రకటన చేసిన అభిజిత్
Abhijit Mukherjee Joins TMC: పశ్చిమ బెంగాల్ రాజకీయాలలో కీలక పరిణామం, టీఎంసీలో చేరిన అభిజిత్ ముఖర్జీ

Abhijit Mukherjee joins Trinamool Congress: పశ్చిమ బెంగాల్ రాజకీయాలలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కుమారుడు అభిజిత్‌ ముఖర్జీ కాంగ్రెస్‌ పార్టీని వీడారు. ఊహాగానాలను నిజంచేస్తూ తృణమూల్‌ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. గత కొన్ని రోజులుగా ఆయన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మద్దతు తెలుపుతున్నారు. 

ఫేక్ కరోనా వ్యాక్సినేషన్ విషయంలోనూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిర్ణయాలకు మద్దతు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా తృణమూల్‌ కాంగ్రెస్(TMC) నేతలతో సంప్రదింపులు జరిపిన అభిజిత్ ముఖర్జీ నేడు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం నాడు సాయంత్రం తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. టీఎంసీ కీలక నేతలు అభిజిత్ ముఖర్జీకి కండువా కప్పి సాధరంగా తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఓ ప్రముఖ వ్యక్తి సోమవారం సాయంత్రం తమ పార్టీలో చేరనున్నట్టు టీఎంసీ ఇదివరకే ప్రకటన విడుదల చేయడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ నేత ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి స్థాయికి చేరగా, ఆయన తనయుడు అభిజిత్ ముఖర్జీ పార్టీని వీడటం బెంగాల్ (West Bengal) రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Also Read: India Corona Positive Cases: ఇండియాలో భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా పాజిటివ్ కేసులు, COVID-19 మరణాలు

టీఎంసీలో చేరిక అనంతరం అభిజిత్ ముఖర్జీ మీడియాతో మాట్లాడారు. బీజేపీ మతతత్వ విధ్వేషాలను, వివాదాలను పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమర్థవంతంగా ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ఆమెకు మరింత మద్దతు తోడైతే దేశంలోని మతతత్వ శక్తులను ఆమె దీటుగా ఎదుర్కొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో కేవలం ప్రాథమిక సభ్యత్వం మాత్రమే కలిగి ఉన్నానని తెలిపారు. పార్టీలోని ఏ విధమైన రాజకీయ పదవులలో లేనని, తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదని స్పష్టం చేశారు. ఇప్పుడు టీఎంసీలో చేరిన తాను పార్టీ అవసరాల కోసం ఓ సైనికుడిలా పనిచేస్తానని చెప్పారు. సెక్యూలరిజం కాపాడేందుకు తాను సైతం పోరాటం చేస్తానని అభిజిత్ ముఖర్జీ (Abhijit Mukherjee) స్పష్టం చేశారు.

Also Read: SP-AAP Alliance: యూపీలో ఎన్నికల్లో ఎస్పీ-ఆప్ పొత్తు దిశగా సాగుతున్న ప్రయత్నాలు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News