జమ్మూలో కొనసాగుతున్న ఉగ్రవాదుల ఏరివేత

సంజ్వాన్, శ్రీనగర్‌లో భారత భద్రతా దళాలకు, తీవ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్న వేళ.. జమ్మూకాశ్మీర్‌లోని మరో ఉగ్రదాడి కదలికలను భారత భద్రతాదళాలు గుర్తించాయి.

Last Updated : Feb 14, 2018, 01:35 PM IST
జమ్మూలో కొనసాగుతున్న ఉగ్రవాదుల ఏరివేత

సంజ్వాన్, శ్రీనగర్‌లో భారత భద్రతాదళాలకు, తీవ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్న వేళ.. జమ్మూకాశ్మీర్‌లో మరో ఉగ్రదాడి కదలికలను భారత భద్రతాదళాలు గుర్తించాయి. వెంటనే సెర్చ్ ఆపరేషన్ ను మొదలుపెట్టాయి.   

మంగళవారం జమ్మూలోని డోమానా ఆర్మీ యూనిట్ వద్ద భద్రతాదళాలు ఉదయం 4:30 గంటల ప్రాంతంలో అనుమానాస్పద కదలికలను గుర్తించారు.  అదనపు బలగాలతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తూ..ఆ ప్రాంతం మొత్తం జల్లెడ పట్టారు. సెర్చ్ ఆపరేషన్ కోసం హెలికాప్టర్‌ను కూడా రంగంలోకి దింపారు.

 

శ్రీనగర్

శ్రీనగర్‌లోని కరణ్‌‌నగర్‌లో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఒక ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరుపుతున్నారు. ఈ ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాదిని జవాన్లు హతమార్చారు. ఒక జవానుకు గాయాలయ్యాయి.

'కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. భారత పౌరులకు, ఆస్తులకు నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాము' అని సీఆర్పీఎఫ్ ఐజీ ఆపరేషన్  హెడ్ జుల్ఫికర్ హసన్ వెల్లడించారు. కాగా శ్రీనగర్‌లోని  కరణ్‌ నగర్‌లో దాడులకు తామే కారణమని లష్కరే- ఈ- తోయిబా తెలిపింది.

 

 

సంజ్వాన్ ఆర్మీ క్యాంపు

గత రెండు రోజులుగా సంజ్వాన్ ఆర్మీ క్యాంపులో ఎదురుకాల్పులు ఆగటం లేదమంగళవారం సంజ్వాన్ ఆర్మీ శిబిరం వద్ద మరో ఆర్మీ జవాన్ ప్రాణాలు కోల్పోయాడు.  

 

సంజ్వన్ ఆర్మీ శిబిరం వద్ద సోమవారం జరిగిన ఉగ్రవాద దాడిలో మొత్తం ఆరు మంది సైనిక సిబ్బంది, ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయారు.జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, డిప్యూటీ సీఎం నిర్మల్ సింగ్ సంజ్వన్ దాడిలో ప్రాణాలను కోల్పోయిన ఆర్మీ జవాన్ల కుటుంబాలను పరామర్శించారు.

 

Trending News