Sonu Sood: సోనూసూద్ మరో సంచలన నిర్ణయం, పేదవారి కోసం ఉచిత ఐఏఎస్ కోచింగ్

Sonu Sood: కరోనా మహమ్మారి వేళ ఆపత్కాలంలో సేవలతో అందరివాడుగా మారిన సినీ నటుడు సోనూసూద్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సాధ్యం కానిది సంభవం అంటున్నాడు. ఆ నిర్ణయం ఇదీ.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 12, 2021, 06:53 PM IST
Sonu Sood: సోనూసూద్ మరో సంచలన నిర్ణయం, పేదవారి కోసం ఉచిత ఐఏఎస్ కోచింగ్

Sonu Sood: కరోనా మహమ్మారి వేళ ఆపత్కాలంలో సేవలతో అందరివాడుగా మారిన సినీ నటుడు సోనూసూద్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సాధ్యం కానిది సంభవం అంటున్నాడు. ఆ నిర్ణయం ఇదీ.

కరోనా వైరస్(Corona Virus) ప్రారంభమైనప్పటి నుంచి ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ అందరికీ సుపరిచితమే కాదు..అందిరవాడుగా మారాడు. మొదటి వేవ్ సమయంలో లాక్‌డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వలస కార్మికుల్ని సొంత ఖర్చులతో సొంతూర్లకు తరలించిన సోనూసూద్ అప్పట్లో వార్తల్లో నిలిచాడు. అప్పట్నించి కరోనా కారణంగా కష్టాల్లో చిక్కుకున్నవారికి సహాయం చేస్తూ వచ్చాడు. సెకండ్ వేవ్ (Corona Second Wave) సమయంలో ఆక్సిజన్ సిలెండర్ల పంపిణీ చేపట్టాడు. ఇప్పుడు కాస్త విభిన్నంగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 

ఐఏఎస్ కావాలని కలలుగనే విద్యార్ధులకు అండగా నిలవాలనుకున్నాడు. సంభవం ( Sambhavam) పేరుతో ఆర్ధికంగా సహకరించేందుకు ముందుకొచ్చాడు. ఈ విషయాన్ని స్వయంగా తనే ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. ఐఏఎస్ కోసం సిద్ధం కావాలనుకుంటున్నారా..మీ బాధ్యత మేం తీసుకుంటా..సంభవం ప్రారంభం గురించి ప్రకటిస్తున్నందుకు థ్రిల్లింగ్‌గా ఉంది అంటూ సోనూసూద్ (Sonu Sood) ట్వీట్ చేశాడు. స్కాలర్ షిప్స్ కోసం www.soodcharityfoundation.org వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని తెలిపాడు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు జూన్ 30 లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరాడు. 

Also read: Aviptadil Medicine: కరోనాకు కొత్తమందు, త్వరలో మార్కెట్లో అవిప్టడిల్ మందు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News