Jitin Prasada Joins BJP: కాంగ్రెస్ అధిష్టానానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత జితిన్ ప్రసాద బుధవారం నాడు భారతీయ జనతా పార్టీ (Jitin Prasada Joined BJP) తీర్థం పుచ్చుకున్నారు. గత కొన్నిరోజులుగా దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీని వీడిన జితిన్ ప్రసాద, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో బీజేపీలో చేరారు.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాయానికి చేరుకున్న జితిన్ ప్రసాద కేంద్ర మంత్రి, బీజేపీ కీలక నేతల సమక్షంలో కాషాయ (Bharatiya Janata Party) తీర్థం పుచ్చుకున్నారు. ఎంపీ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితులలో ఒకరైన జితిన్ ప్రసాద కాంగ్రెస్ పార్టీని వీడటం ఆ పార్టీకి ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. 2022లో యూపీ అసెంబ్లీ ఎన్నికలుండగా, ఈ సమయంలో సీనియర్ నేత జితిన్ ప్రసాద కాంగ్రెస్ పార్టీని వీడటం కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.
Also Read: TS Cabinet meeting important points:తెలంగాణ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు
Delhi: Congress leader Jitin Prasada joins BJP in the presence of Union Miniter Piyush Goyal, at the party headquarters. pic.twitter.com/lk07VGygbe
— ANI (@ANI) June 9, 2021
వచ్చే అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికల్లోనూ ఉత్తరప్రదేశ్‌లో జితిన్ ప్రసాద కీలకపాత్ర పోషించనున్నారు. గతంలో యూపీ ఇన్ఛార్జ్ ప్రియాంక గాంధీ నిర్ణయం ఆయనకు ప్రతికూల ఫలితాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ధౌరారా సీటు నుచి పోటీ చేయాలని జితిన్ ప్రసాద భావించగా, లక్నోలో బీజేపీ కీలక నేత రాజ్‌నాథ్ సింగ్‌ను నిలువరించాలని ప్రియాంక గాంధీ సూచించారు. తన అభిప్రాయాలకు కాంగ్రెస్ పార్టీ (Congress Party)లో మద్దతు కరువవడంతో వ్యూహాన్ని మార్చి బీజేపీలో చేరినట్లు సమాచారం. త్వరలోనే మరికొందరు కాంగ్రెస్ నేతలు బీజేపీ చేరనున్నారని, యూపీ అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా చేరికలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: 10 Babies Born At once: ఒకే కాన్పులో 10 మంది శిశువులు జననం, Guinness World Record
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook