Covid Vaccination: కరోనా మహమ్మారి కట్టడికి ఏకైక మార్గం వ్యాక్సినేషన్. దేశంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ కొత్త గైడ్‌లైన్స్ జారీ చేస్తామన్నారు.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) ఉధృతి ఇప్పుడు తగ్గుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేయనుంచి కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి కీలక ప్రకటన విడుదల చేసింది. కరోనా సెకండ్ వేవ్ అనంతరం తొలిసారి జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలో కీలక విషయాల్ని ప్రస్తావించారు. వ్యాక్సినేషన్ బాధ్యత ఇకపై పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదేనని(Central government) మోదీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా వ్యాక్సిన్లను పంపిణీ చేస్తుందని చెప్పారు. ఈ విషయమై త్వరలో కొత్త గైడ్‌లైన్స్ జారీ చేస్తామన్నారు.
జూన్ 21వ తేదీ నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో సర్వీస్ ఛార్జ్ కేవలం 150 రూపాయలు మాత్రమే తీసుకోవాలన్నారు. కరోనాతో జరుగుతున్న యుద్ధంలో ఇండియా గెలుస్తుందని చెప్పిన మోదీ..నవంబర్ నాటికి 80 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామన్నారు. దీపావళి వరకూ పీఎం గరీబ్ కళ్యాణ్ అన్నదాన యోజన పథకం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పేద ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. వ్యాక్సిన్ల విషయంలో కొందరు కావాలనే గందరగోళం సృష్టిస్తున్నారని..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra modi) సూచించారు.
Also read: India Corona Update: ఆ రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజుకు వేయి కంటే తక్కువే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook