China New Strain: చైనాలో మరో కొత్త స్ట్రెయిన్, సర్వత్రా ఆందోళన

China New Strain: వుహాన్.. చైనాలో నగరం అనేకంటే కరోనా వైరస్ పుట్టిన ప్రాంతం. ఇప్పుడు గాంజావ్ సిటీలో మరో కొత్త రకం స్ట్రెయిన్ దడ పుట్టిస్తోంది. అత్యంత ప్రమాదకర స్ట్రెయిన్ కావడంతో చైనా అధికారులు ఆందోళన చెందుతున్నారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 30, 2021, 12:18 PM IST
China New Strain: చైనాలో మరో కొత్త స్ట్రెయిన్, సర్వత్రా ఆందోళన

China New Strain: వుహాన్.. చైనాలో నగరం అనేకంటే కరోనా వైరస్ పుట్టిన ప్రాంతం. ఇప్పుడు గాంజావ్ సిటీలో మరో కొత్త రకం స్ట్రెయిన్ దడ పుట్టిస్తోంది. అత్యంత ప్రమాదకర స్ట్రెయిన్ కావడంతో చైనా అధికారులు ఆందోళన చెందుతున్నారు.

2019 నవంబర్ నెలలో చైనాలోని వుహాన్(Wuhan City) నగరం నుంచి వ్యాపించిన కరోనా వైరస్ (Corona virus) ప్రపంచమంతా వ్యాపించింది. లక్షలాదిమందిని పొట్టన బెట్టుకుంది. అప్పట్నించి రూపం మార్చుకుంటూ భయపెడుతూనే ఉంది. మొన్న ప్రపంచదేశాల్లో సెకండ్ వేవ్..ఇప్పుడు ఇండియాలో సెకండ్ వేవ్ భయంకర పరిస్థితుల్ని సృష్టిస్తోంది. ఇండియా సెకండ్ వేవ్ ( Corona Second Wave) నుంచి కోలుకోకముందే ఇప్పుడు అదే చైనాలోని మరో నగరం గాంజావ్ సిటీ కొత్త స్ట్రెయిన్‌కు(New Strain)వేదికగా నిలిచింది. చైనాలో కొత్త రకం స్ట్రెయిన్ దడ పుట్టిస్తోందిప్పుడు. గతంలోని స్ట్రెయిన్‌లతో పోలిస్తే ఈ స్ట్రెయిన్ అత్యంత ప్రమాదకరంగా తేలడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 1.5 కోట్లమంది జనాభాతో ఉండే గాంజావ్ నగరంలో కేవలం వారంలో రోజుల్లో 20 కొత్త స్ట్రెయిన్ కేసులు బయటపడ్డాయి. చైనాలో తాజాగా వెలుగు చూసిన కొత్త స్ట్రెయిన్ చాలా ప్రమాదకరంగా ఉన్నట్టు గ్లోబల్ టైమ్స్ పత్రిక ప్రచురించింది.

కొత్త స్ట్రెయిన్ వెలుగుచూడటంతో గాంజావ్ (Ganjau City) నగరంలో కఠిన ఆంక్షలు విధించింది. ఎవరూ ఇంటి నుంచి బయటకు రావద్దని..ఇళ్లలోనే ఉండాలని ఆదేశించింది. కొత్త వేరియంట్ వెలుగుచూడటంతో సంక్రమణ పరిస్థితిని తెలుసుకునేందుకు చైనా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కొత్త వేరియంట్ ఇంకా ఎక్కడుందనేది తెలుసుకునేందుకు లివాన్ జిల్లాలోని 5 ప్రాంతాల్లో ప్రజలకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Also read: Boris Johnson Marriage: ప్రియురాలిని సీక్రెట్‌గా వివాహం చేసుకున్న UK PM బోరిస్ జాన్సన్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News